ప్రకాశం

తాగునీటిపై వైకాపావి నీచ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,ఏప్రిల్ 5: తాగునీటి సమస్యపై వైకాపానేతలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలుశాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లాతెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రకాశం, గుంటూరుజిల్లాల్లో వర్షాలు కురవనందున తాగునీటి సమస్య వచ్చిందన్నారు.వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి ప్రకాశం జిల్లాకు 2.3 టిఎంసిలు, గుంటూరుజిల్లాకు 2.3టిఎంసిల చొప్పున నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. దీంతోపాటు జిల్లాలోని అన్ని హేబిటేషన్లల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌కు 15కోట్లరూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. గత వారంరోజులనుండి జిల్లాకు ఎన్‌ఎస్‌పి కాల్వ ద్వారా తాగునీరు విడుదలైందని జిల్లాలోని అన్నిచెరువులకు తాగునీటిని నింపారన్నారు. ఇప్పటివరకు రామతీర్థ జలాశాయానికి 1.79 టిఎంసిల నీటిని నింపామన్నారు. ఒంగోలులో సాగర్‌కాల్వల వచ్చే వృథానీరుపోయిందే తప్ప సాగర్‌నీరు పూర్తిగా బయటకుపోలేదని దీనిపై వైకాపా నేతలు ధర్నాలు చేయటం మంచిదికాదన్నారు. పూర్తిస్థాయిలో పోలీసులు, రెవెన్యూ, ప్రజాప్రతినిధులు కాల్వల వెంట ఉంటూ తాగునీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చెరువులను నింపేందుకు సహకారం అందిస్తుంటే వారిపై కూడా వైకాపా నేతలు విమర్శలు చేయటం మంచిది కాదన్నారు. 120కిలోమీటర్ల మేర సాగర్‌కాల్వలపై తాము కూడా పరిశీలన చేశామన్నారు. ఒంగోలులోని రెండుసమ్మర్ స్టోరేజి ట్యాంకులకు మరో వారంరోజుల్లో పూర్తిగా నింపుతామన్నారు. మూడురోజులకొకసారి నగరప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు తయారుచేశారని, ప్రస్తుతం నగరప్రజలకు మూడురోజులకొకసారి నీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం విడుదలైన తాగునీరు మరోమూడునెలల పాటుసరిపోతుందని ఈలోగా 40కోట్లరూపాయలతో గుండ్లకమ్మ ప్రాజెక్టునుండి ఒంగోలుకు పైపులైనుపూర్తి చేసి తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామన్నారు. ఒకపక్క కరువు, మరోపక్క వర్షాలులేక ప్రజలు అల్లాడిపోతుంటే ఆ సమస్యలపై తాము స్పందిస్తూ ముందుకు వెళ్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షపార్టీ కూడా విమర్శలు చేయటం మంచిదికాదన్నారు. గత పదిసంవత్సరాల కాంగ్రెస్‌పరిపాలనలో అన్ని రంగాలను నిర్వీర్యం చేశాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తమప్రభుత్వం వెంటనే విద్యుత్ సమస్యపై దృష్టిసారించి రాష్ట్రప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోని చెరువులకు 50శాతం తాగునీటిని నింపామని మరో 50శాతం తాగునీటిని నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశంపార్టీ నాయకులు పాల్గొన్నారు.