ప్రకాశం

టి కృష్ణ కొడుకుగా పుట్టడం నా అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 6: టి కృష్ణ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టమని సినీ దర్శకులు టి కృష్ణకుమారుడు సినీ హీరో గోపీచంద్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ ఆవరణలో టి కృష్ణ 30వ వర్థంతి సభ జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపీచంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా టి కృష్ణ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టి కృష్ణ వర్థంతి సందర్భంగా పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం 20 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రెండు లక్షల రూపాయలు ఇచ్చి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. టి కృష్ణ వర్థంతి సందర్భంగా 5, 6 తేదీలలో క్విజ్, ఆటల పోటీలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగిందని, వీరి అందరికి బహుమతులను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టి కృష్ణ ప్రజానాట్య మండలిలో చురుకుగా పనిచేయడంతోపాటు ప్రజలను చైతన్యం చేసేటువంటి సినిమాలకు దర్శకత్వం వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ టి కృష్ణ ఒంగోలులోని శర్మ కళాశాలలో చదివారని, అందరికీ పరిచితలని, టి కృష్ణ ప్రకాశం జిల్లావాడు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆయన కుమారుడు గోపీచంద్ కూడా సినీ హీరో కావడం సంతోషకరమన్నార. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు నాగేశ్వరరావు, సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి యు ప్రకాశరావు, టి కృష్ణ మెమోరియల్ స్కూలు అధినేతలు రామయ్య, వసుందరదేవి, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు గని, చంద్రానాయక్, ప్రైవేటు స్కూల్స్ అధినేత రాజు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. గోపీచంద్ సభలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని కేరంతలు కొట్టారు.