ప్రకాశం

500, 1000 నోట్ల రద్దుతో ప్రజల అయె మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 8:దేశవ్యాప్తంగా ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచనల నిర్ణయం తీసుకోవటంతో జిల్లాలోని అన్నివర్గాల వారు అయోమయంలో ఉన్నారు. ఈనోట్లను డిసెంబర్ 31వతేదీలోగా బ్యాంకులు, పోస్టల్స్‌లో డిపాజిట్లు చేసుకోవచ్చుని ప్రధానమంత్రి ప్రకటించారు. అదేవిధంగా ఈ మంగళవారం అర్ధరాత్రినుండి ఈ నోట్లు చెల్లుబాటులోకి రావని ప్రకటించారు. వాటిస్థానంలో కొత్తగా ఐదువందల రూపాయల నోట్లు, రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇదిలాఉండగా బ్యాంకుల లావాదేవీల రెండురోజులపాటు నిలిపివేశారు. ఎటిఎంలు కూడా ఈరెండురోజుల పనిచేయవు. కొత్తనోట్లు ఈనెల 10వతేదీన విడుదల చేస్తామని ఆర్‌బిఐ గవర్నర్ ప్రకటించారు. మొత్తంమీద పదినుండి వందల కోట్లరూపాయల నల్లదనం ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లు ఉన్నవారు బ్యాంకులకు పరిగెత్తనున్నారు. మొత్తంమీద భారతప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంతో నల్లదనం మొత్తం బయటకు రానున్న నేపధ్యంలో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

దర్శి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా
* ఇప్పటికే రూ. 1500కోట్ల అభివృద్ధి పనులు
* రోడ్లు భవనాలు, రవాణశాఖమంత్రి శిద్దా రాఘవరావు

ఒంగోలు,నవంబర్ 8:యమగోల సినిమాలో ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలితే రావుగోపాల్‌రావు తుపాకి కాల్చిచంపిన చందంగా ఉంది జిల్లాలోని బావమరుదుల పరిస్థితి. దీంతో జిల్లాలో ఎవరిదారి వారిది అన్న పరిస్థ్దితులు నెలకొనటంతో పార్టీశ్రేణులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇద్దరు కలిసి కృష్ణార్జుల్లాగా ఉంటే జిల్లాలో పార్టీపరుగులు పెడుతుందన్న వాదన ఆ పార్టీశ్రేణుల నుండే వినిపిస్తోంది. కాని వీరిద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ఈలాంటి పరిస్థితికి వైకాపా రాష్ట్ర అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించకపోతే మాత్రం కృష్ణార్జుల యుద్ధంలాగానే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏర్పడనుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంనుండి వైవి సుబ్బారెడ్డి గెలుపొందగా, ఒంగోలు నియోజకవర్గంనుండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమిపాలైనారు.అనంతరం జరిగిన పరిణామాల నేపధ్యంలో ఇద్దరి మధ్య సయోధ్యలేకుండా పోయింది. దీంతో జిల్లాలోని పార్టీశ్రేణులు ఇద్దరి దగ్గరికి వెళ్తూ వారివారి పబ్బం గడుపుకుంటు పోతున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవటంతో కొంతమంది దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ వీరి దగ్గర మాటలు వారిదగ్గర, వారిదగ్గర మాటలు వీరిదగ్గర చెప్పుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీపరంగా జరిగే కార్యక్రమాల్లోవీరిద్దరు నేతలు కలవటం బాహుఅరుదుగా మారిందనే చెప్పవచ్చు. వీరిద్దరు గృహాలు కూడాపక్క పక్కనే ఉంటాయికాని మాటలు మాత్రం ఉండవు. ఇదిఇలాఉండగా ఇటీవల కాలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి శంఖుస్ధాపన జరిగింది. ఈ శంఖుస్ధాపన కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి హాజరుకాకపోవటం విశేషం. పైగా ఆయన ఒంగోలులోనే ఉండటం గమనార్హం. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎంపి నిధులనుండి లక్షలాదిరూపాయలను విడుదల చేశారు.కాని ఆ పనులు పూర్తిఅయ్యాక వాటి ప్రారంభోత్సవాలకు మాత్రం ఎంపి సుబ్బారెడ్డికి ఆహ్వానాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి మాత్రం ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డికి ఆహ్వానం వచ్చింది. దీంతో ఆయన ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. నెల్లూరు పార్లమెంటుసభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈనూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాలోని పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జులు హాజరుకానున్నారు. కాగా జిల్లాలోగడపగడపకు వైకాపా కార్యక్రమం కూడా మొక్కుబడిగానే సాగుతుంది. కొంతమంది స్పీడుగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో నత్తనడకన సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని కొంతమంది నియోజకవర్గాల ఇన్‌చార్జుల పనితీరుపై కూడా రాష్టప్రార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని కందుకూరు మునిసిపాలిటి, ఒంగోలునగరకార్పోరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకుత్వరలో ఎన్నికలు జరుగుతాయని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్వయానా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనేపధ్యంలో మునిసిపల్ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీశ్రేణులు సమాయత్తవౌతున్నారు. ఈలాంటి తరుణంలో ఈ రెండు మునిసిపాలిటిల్లో గెలుపుగుర్రాలకే టిక్కెట్లను వైకాపా నేతలు కేటాయించాల్సిన అవసరం ఉంది. కాగా కందుకూరుమునిసిపాలిటి పరిధిలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ ఒకప్యానల్, వైకాపా ఒకప్యానల్‌తోపాటు, రాష్టమ్రాజీ మంత్రి, కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా తన స్వంత ప్యానల్‌ను ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఆమేరకు ఆయన అనుచర గణానికి సాంకేతాలు పంపినట్లు తెలుస్తొంది. మొత్తంమీద ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తే జిల్లాలో పార్టీపరుగులు పెడుతుందన్న భావన ఆపార్టీశ్రేణులనుండి వినిపిస్తొంది. లేని పక్షంలో మాత్రం జిల్లాలో రెండుగ్రూపులుగా విడిపోయిపార్టీకి చేటు వచ్చే అవకాశాలున్నాయి.

విద్యార్థిని ఆత్మహత్యతో
ఇంజనీరింగ్ కాలేజిలో వద్ద ఉద్రిక్తత
బంధువుల ఆందోళన
టంగుటూరు,నవంబర్ 8:ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజిలో మంగళవారం మొదటిసంవత్సరం సివిల్ విద్యను చదువుతున్న కల్లూరి నాగలక్ష్మి(19) తన చున్నితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. నాగలక్ష్మి మృతితో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మారుమోగింది.చిన్న వయస్సులోనే విద్యార్థిని మృతిచెందటం పట్ల తోటి విద్యార్థినిలు ఎంతో కలతచెందారు. ఈసందర్బంగా నాగలక్ష్మి తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కుమార్తె డిగ్రీలో చేరతానని చెప్పిందని అయితే తాము ఇంజనీరింగ్‌లో చేరాలని ఒత్తిడి చేయటంతో ఆమె ఇష్టం లేకపోయినప్పటికి ఒంగోలుసమీపంలోని ఫేస్ ఇంజనీరింగ్ కాలేజిలోమొదటిసంవత్సరం ఇంజనీరింగ్ సివిల్‌లో చేర్చాన్నారు. ఈ క్రమంలో ఆదివారం తమ కుమార్తె నాగలక్ష్మి తమగ్రామమైన తలమళ్లకు వచ్చిందని ఇంజనీరింగ్ విద్యను చదవటం లేదని ఇష్టంలేదని చెప్పిందని తెలిపారు.అయితే ఇంజనీరింగ్ విద్య మెరుగైన విద్యకావటంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని సర్ధిచెప్పి తాము కాలేజికి సోమవారం పంపించామన్నారు. ఈక్రమంలో మానసిక ఆవేదనకు గురైందో ఎమో తమకు తెలియదు కాని ఫేస్‌కాలేజిలోని బాలికల హాస్టల్‌లో మంగళవారం ఉదయం ఆరు, ఏడుగంటల సమయంలో హాస్టల్‌రూంలో ఫ్యాన్‌కు తన చున్నితో ఉరివేసుకుని మృతిచెందిందని ఈవిషయాన్ని తమకు సమాచారాన్ని కాలేజి యజమాన్యం అందించిన వెంటనే తామురావటం జరిగిందన్నారు. తమసమక్షంలోనే తలుపులను పగలకొట్టి తమ కుమార్తె మృత దేహాన్ని కాలేజి యజమాన్యం పోలీసుల సమక్షంలో బయటకుతీయటం జరిగిందన్నారు. తమకుమార్తె మరణానికి కాలేజి యజమాన్యం కారణంగా తాము భావించటం లేదని ఆయన తెలిపారు. సంఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టంగుటూరు ఎస్‌ఐ ఎంవి శివకుమార్, సింగరాయకొండ ఎస్‌ఐ రమణయ్య,జరుగుమల్లి ఎస్‌ఐ రామకోటయ్య, కొండెపి ఎస్‌ఐ చంద్రశేఖర్ తదితర పోలీసు సిబ్బంది నిర్వహించారు. కాగా మహిళాకమీషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి కూడా సంఘటన స్ధలాన్ని పరిశీలించారు.