ప్రకాశం

రెవిన్యూ ఉద్యోగులను వేధిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, నవంబర్ 14 : రెవిన్యూ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తే తమ సంఘం ఊరుకోదని రాష్ట్ర రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పొదిలిలో ఆయన సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పోలీసు, రెవిన్యూ వ్యవస్థలు రెండు కళ్లువంటివన్నారు. ఆయా శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇటీవల పోలీస్ డిజిపి విధి నిర్వహణలో ఉన్న రెవిన్యూ ఉద్యోగులపై కేసులు నమోదు చేయవద్దని, కలెక్టర్ అనుమతులు లేకుండా ఎలాంటి అరెస్టులు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. అందుకు డిజిపికి తమ సంఘం కృతజ్ఞతలు తెలుపుతుందని ఆయన తెలిపారు. ఆర్‌టిఎ కమిషనర్ విజయబాబు రెవిన్యూ ఉద్యోగులను కించపర్చడం, అసభ్యకరంగా మాట్లాడటం మంచిపద్దతి కాదన్నారు. ఆయన తన వైఖరిని మార్చుకోకపోతే తమ సంఘం ఆందోళన చేపట్టేందుకు కూడా వెనుకాడదని ఆయన హెచ్చరించారు. విఆర్‌వోలకు క్లస్టర్ విధానం ద్వారా నియమించడంతో పనిభారం ఎక్కువగా ఉంటుందని, అందువలన 500 నుండి వెయ్యి ఎకరాలలోపు ఉన్న గ్రామాలను కాని వెయ్యి నుండి 1500 లోపు జనాభా కలిగిన గ్రామాన్ని కాని ట్రాఫిక్ ప్రాతిపదికన తీసుకుని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విఆర్‌వోను నియమిస్తే ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న విఆర్‌ఏలకు ప్రతి నెలా 200 టిఏ, 300 డిఏ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేసే వారికి తమ సంఘం నుండి ఏలాంటి మద్దతు ఉండదని బొప్పరాజు స్పష్టం చేస్తూ తెలియక పొరపాట్లు చేసే వారి పట్ల కొంత కనికరం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా గమనించాలని బొప్పరాజు కోరారు. బయోమెట్రిక్ విధానం నుండి రెవిన్యూశాఖలోని ఎగ్జిక్యూటివ్ లైనులో పనిచేసే తహశీల్థార్, విఆర్‌వో వంటి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పలుచోట్ల రెవిన్యూ కార్యాలయాలు శిథిలస్థితికి చేరుకున్నాయని, వాటిని మరమ్మతులు చేయడం లేకపోతే పక్కా భవనాలు చేపట్టడం వంటి కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని గ్రామ చావిళ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిని ప్రభుత్వం గుర్తించి కాపాడాలని బొప్పరాజు కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు పి జనార్దన్‌రావు, ఎం అంజిబాబు, బి పుల్లయ్య, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.