ప్రకాశం

కొనసాగుతున్న కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 15: బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల వద్ద ఖాతాదారులకు కష్టాలు తీరటం లేదు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేసిన నేపధ్యంలో ఖాతాదారుల కష్టాలు సినిమా కష్టాలకంటే వర్ణణాతీతంగా మారాయనే చెప్పవచ్చు. రోజు,రోజుకూ కేంద్రప్రభుత్వం ఖాతాదారులు నగదును డ్రా చేసుకునేందుకు షరతులను సడలిస్తున్నప్పటికీ బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో మాత్రం ఖాతాదారులకు సరిపడా నగదు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎటిఎంల వద్ద ఉదయం నుండి రాత్రి వరకు ఖాతాదారులతో క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. గతంలో కొత్తసినిమా వచ్చిందంటే టిక్కెట్ల కోసం ప్రజలు క్యూలో ఉండేవారు. కాని ప్రస్తుతం ఏ ఎటిఎం, ఏ బ్యాంకు వద్దకు వెళ్లినా ఖాతాదారులతో చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఖాతాదారులకు సకాలంలో నగదును అందించేందుకు అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా బ్యాంకర్లు ఎక్కువ శాతం మంది డిపాజిట్లు వేసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పాత నోట్లకు కొత్తనోట్ల కోసం ఖాతాదారులు గంటల కొద్ది బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చిల్లర సమస్యలు మాత్రం యధాతధంగానే కొనసాగుతున్నాయి. వంద, యాభై, 20, పదిరూపాయలకు మాత్రం భారీగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. వ్యాపార లావాదేవీలు మాత్రం పెద్దగా జరగకపోవటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల వ్యాపారులు తమ షాపులకు అద్దెలను సైతం చెల్లించలేని పరిస్థితికి వచ్చేశారు. మోదీ ప్రకటనతో వ్యాపారాలు పూర్తిస్థాయిలో మందగించాయి. షాపులకు మాత్రం అద్దెలు వేల రూపాయల నుండి లక్షల్లో అద్దెదారులు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో తమ పరిస్థితి ఏమిటన్న చర్చ అద్దెదారుల్లో నెలకొంది.
ఇదిలా ఉండగా చిల్లరదెబ్బ రొయ్యలవ్యాపారం, సాగుపై పెనుప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 30కౌంట్ కేజి వెనామీ రొయ్య 560రూపాయల నుండి 580 రూపాయల వరకు ఉండటంతో రైతులు ఎక్కువగా సాగును చేపట్టారు. రొయ్యలసాగు నడి మధ్యలోనే రోగాలబారిన పడిన, పంట వచ్చిన వారికి నగదును ఇచ్చే పరిస్థితిలో వ్యాపారులు లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆక్వారంగంపై పడిందని జిల్లా మత్స్యశాఖ సహాయసంచాలకులు లాల్‌మహమ్మద్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. చిల్లర సమస్యను త్వరితగతిన తీర్చాలని కేంద్రప్రభుత్వానికి అన్నివర్గాల వారు సూచిస్తున్నారు.