ప్రకాశం

నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, నవంబర్ 17 : నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం జనచైతన్య యాత్రల్లో భాగంగా దర్శి గడియారం స్తంభం సెంటర్‌లో జరిగిన సభలో మంత్రి శిద్దా మాట్లాడుతూ ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిందన్నారు. చంద్రబాబునాయుడుపై ఉన్న నమ్మకంతో రాష్ట్రప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా నూతన రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందంజలో ఉంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని దేశంలో అనేకమంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు. మహిళలకు డ్వాక్రారుణాల మాఫీతో ఆర్థికంగా వెసులుబాటు కల్పించారని తెలిపారు. రైతులకు సాధికార సంస్థను ఏర్పాటుచేసి రైతులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీతో రైతుల కష్టాలు తీర్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తాను సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, మీ అందరి నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా సేవాకార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందితే నియోజకవర్గంలో వలసలు నివారించవచ్చని తెలిపారు. ఏటుచూసినా నాలుగులైన్ల రహదారులతో నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. దొనకొండ విమానాశ్రయం కూడా త్వరలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని రూ.17 కోట్లతో నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో రక్షిత మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో రక్షిత శుద్ధజల కేంద్రాలను సొంత నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనచైతన్యయాత్రలో భాగంగా వీరాయపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఎఎంసి చైర్మన్ సూరే చినసుబ్బారావు, ఎంపిపి పూసల సంజీవయ్య, సర్పంచ్ విసి గురవయ్య, జడ్పీటిసి గర్నేపూడి స్టీవెన్, మండల టిడిపి అధ్యక్షుడు గొర్రె సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసరావు, వేతనసంఘం రాష్ట్ర సభ్యురాలు శోభారాణి, టిడిపి నాయకులు మేడా హనుమంతరావు, బొగ్గవరపు సుబ్బారావు, అచ్యుత ప్రకాశ్, వౌలాలి పాల్గొన్నారు.

మహిళలు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునిఆర్థిక పురోభివృద్ధి సాధించాలి
* జిల్లాకలెక్టర్ సుజాతశర్మ వెల్లడి

ఒంగోలు, నవంబర్ 17 : పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు నేటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. గురువారం మెప్మా ఆధ్వర్యంలో స్థానిక డాన్‌బాస్కో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో వృత్తి నైపుణ్యశిక్షణ, ఉపాధిహామీ పథకం కింద డ్వాక్రాసంఘాల మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పంచ సూత్రాలను కచ్చితంగా పాటించాలన్నారు. డ్వాక్రా సంఘాలు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలని, పొదుపు చేయాలని, అంతర్గతంగా అందరి ఆమోదంతో తీర్మానం పొంది రుణాలు తీసుకుని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. పంచసూత్రాలు కచ్చితంగా పాటిస్తేనే సంఘాలు బలోపేతం అవుతాయన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి 60వేల ఎస్‌హెచ్‌జి గ్రూపులు ఉన్నాయని, వాటిలో పట్టణ ప్రాంతాల్లో తొమ్మిదివేల గ్రూపులు ఉన్నాయన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించాలని, మైక్రోప్రణాళికపరంగా తీసుకున్న రుణాలు సక్రమంగా ఖర్చు పెట్టాలన్నారు. తీసుకున్న రుణాలు కుటుంబం కోసం ఖర్చుపెడుతూ పొదుపు చేసుకోవాలన్నారు. నేటి ఆధునిక పరిజ్ఞానం కంప్యూటర్, ఇంటర్నెట్‌లాంటివి నేర్చుకోవాలని, మహిళలు బ్యాంకు కరస్పాండెంట్లుగా తయారుకావాలని సూచించారు. మహిళలు తాము చేపడుతున్న వృత్తుల్లో నైపుణ్యతను పెంపొందించుకుంటేనే సమాజంలో మనుగడ సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా మహిళలు ఆలోచన చేయాలన్నారు. జిల్లా ప్రజాసాధికార సర్వే 81శాతం పూర్తయిందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే సంబంధిత మండల పరిషత్ అధికారి, తహశీల్దార్ లేదా ఎన్యుమరేటర్ బృందాన్ని కలిసి కచ్చితంగా ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన కారణంగా సామాన్యప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకు అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని పెద్దనోట్ల సమస్యలు త్వరలో తీరుతాయన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. ప్రభుత్వం రూ.24 వేల దాకా బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ లావాదేవీలు చేయాలని సూచించినట్లు గుర్తుచేశారు. డ్వాక్రాసంఘాల మహిళలు తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ జన్‌ధన్ ఖాతాల్లోకి మార్చుకోవాలని, ఈ ఖాతా ఉన్నవారికి బ్యాంకు రుపేకార్డు జారీ చేస్తారని, ఈ కార్డుకు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోఅభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. వారు చేపట్టే వృత్తుల ద్వారా ఆదాయమార్గాలు పొందాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వృత్తినైపుణ్య శిక్షణ అందిస్తుందని, తద్వారా కుట్టుమిషన్ల పంపిణీ, ఎంబ్రాయిడరీ నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళలు పొదుపుగ్రూపులుగా ఏర్పడిన వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధిలో మహిళలు ముందుకు వెళ్లాలని, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వం అందించే పలు పథకాల వల్ల ఎక్కువమంది లబ్ధి పొందాలన్నారు. ఆ దిశగా ఎస్‌హెచ్‌జి గ్రూపుల్లో మహిళలు చేరేలా చూడాలన్నారు. మెప్మా పిడి అన్నపూర్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ జిల్లాలో ప్రథమంగా ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో డ్వాక్రాసంఘాల మహిళలకు మూడునెలల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేయించి 80మంది మహిళలకు ఆరువేల రూపాయల విలువైన కుట్టుమిషన్లను జిల్లా కలెక్టర్, ఒంగోలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మహిళలకు జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సర్ట్ఫికెట్లతోపాటు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మెప్మా పిడి ఆధ్వర్యంలో కలెక్టర్ సుజాతశర్మ, ఎమ్మెల్యే దామచర్లను శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శింగరాజు రాంబాబు, డ్వాక్రాసంఘాల మహిళలు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
కంభం, నవంబర్ 17: ఎదురెదురుగా రెండు మోటారుసైకిళ్ళు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కందులాపురం గ్రామానికి చెందిన కాటమాల అనిల్‌కుమార్ తన మోటారుసైకిల్‌పై నారాయణతో కలిసి కంభం నుంచి కందులాపురం వెళ్తుండగా, ఎల్‌కోట నుంచి వెంకటరాజు, రాజశేఖర్‌రెడ్డి మోటార్‌బైక్‌పై కంభంకు వస్తూ స్థానిక గురుకుల పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ఈప్రమాదంలో కాటమాల అనిల్‌కుమార్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణ, వెంకటరాజు, రాజశేఖర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు అనిల్‌కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎస్సై మాధవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కందుకూరులో కేంద్ర బృందం పర్యటన
కందుకూరు, నవంబర్ 17: కందుకూరు మున్సిపాలిటీని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా అధికారులు ప్రకటించిన క్రమంలో పట్టణంలోని పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర అంశాలపై న్యూఢిల్లీకి చెందిన క్వాలిటీ మిషన్ ఇండియా నుంచి వచ్చిన అధికారి ఎ బాల అరవింద్ గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముత్యాలకుంట, గుణ్నంకట్ట, ఖాజీపాలెం, దివివారిపాలెం తదితర ప్రాంతాలు, పలు పాఠశాలలను పరిశీలించారు. అలాగే పట్టణంలోని వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుంచి కందుకూరు మున్సిపాల్టీని బహిరంగ మల మూత్ర విసర్జనలేని మున్సిపాల్టీగా ప్రకటించినట్లు, ఈక్రమంలో పట్టణంలోని అన్ని అంశాలను పరిశీలించేందుకు ఓడిఎఫ్ ఆడిట్‌లో భాగంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. మున్సిపాల్టీ ఓడిఎఫ్‌కు అనుకూలంగా ఉందని, త్వరలో మున్సిపాల్టీకి ఓడిఎఫ్ సర్టిపికెట్‌ను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంఎల్‌సి ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో
తలమునకలైన జిల్లా యంత్రాంగం
* తెలుగుదేశం పార్టీ ఎంఎల్‌సి అభ్యర్థిగా పట్ట్భారామిరెడ్డి,
పిడిఎఫ్ అభ్యర్ధిగా యండపల్లి
* వీరిద్దరిలో వైకాపా సానుభూతిపరుల మద్దతు ఎవరికో ?

ఒంగోలు, నవంబర్ 17 : ఎంఎల్‌సి ఎన్నికల్లో వైకాపా దూరంగా ఉండటంతో ఆ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లు తెలుగుదేశం పార్టీకా, పిడిఎఫ్ అభ్యర్థికా అన్న చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రకటించక ముందే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి చెందిన వి పట్ట్భారామిరెడ్డి ప్రకటించారు. అదేవిధంగా పిడిఎఫ్ అభ్యర్థిగా యండపల్లి శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొననుంది. వైకాపా మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండటంతో పార్టీశ్రేణులు కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసి తమ సత్తా ఏమిటో తెలియచేయకుండా అధిష్టానవర్గం కిమ్మనకపోవడం ఏమిటన్న చర్చ మాత్రం వైకాపా నేతల్లో వినిపిస్తోంది. ప్రతి ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాల్సిందిపోయి కేవలం పార్లమెంటు, అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికలనే తీసుకుంటే ఎలా అన్న వాదన పట్ట్భద్రుల్లో చర్చనీయాంశమైంది. వైకాపాకు చెందిన పట్ట్భద్రులు చాలామంది తమకు ఓటు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 84 వేలమంది పట్ట్భద్రులు తమకు ఓటు కావాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఓటర్ల జాబితాను తయారుచేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. గతంలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థి దేశాయిశెట్టి హనుమంతరావు పోటీచేసి ఓటమిపాలయ్యారు. కాని ఈసారి తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న దీమాలో నేతలు ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు విచ్చేసిన సమయంలో రానున్న ఎంఎల్‌సి ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుని అభ్యర్థులను గెలిపించాలని ఆదేశించడం తెలిసిందే. అదేవిధంగా ఈ సారి టిడిపి శ్రేణులు జిల్లావ్యాప్తంగా పట్ట్భద్రులకు దరఖాస్తులను అందచేసి ఓటర్లుగా చేర్పించారు. జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌ఛార్జీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులకు ఈ పాటికే సూచించారు. కాగా పిడిఎఫ్ అభ్యర్థిగా గతంలో యండపల్లి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోను ఆయనే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నారు. ప్రజా సమస్యలపై, పట్ట్భద్రుల సమస్యలపై శాసనమండలి, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు, ఇతర సమావేశాల్లో యండపల్లి గళమెత్తి పరిష్కరించేవారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, తమ అభ్యర్ధి గెలుపు ఖాయమన్న దీమాలో పిడిఎఫ్ నేతలు ఉన్నారు. మొత్తంమీద వైకాపాకు చెందిన సానుభూతిపరులు ఎవరికి ఓట్లు వేస్తారన్న చర్చ సాగుతోంది.

ప్రభుత్వ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష
* ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు అర్బన్, నవంబర్ 17 : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా గురువారం 23వ డివిజన్‌లోని పత్తివారివీధి, గానుగపాలెం, అరవపాలెం, పాత మార్కెట్ సెంటర్‌లలో దామచర్ల జనార్దన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ఆయా ప్రాంతాల ప్రజలు దామచర్లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాత మార్కెట్ సెంటర్‌లోని కొంతమంది పేదలు తమకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మరికొన్ని ప్రాంతాల్లో తాగునీరు మురికిగా వస్తున్నాయని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఒంగోలులో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు, మహిళలకు పంపిణీ చేస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి వీధికి వెళ్లి స్వయంగా అభివృద్ధి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాల్లో జరిగిన సభల్లో దామచర్ల మాట్లాడుతూ తాను శాసనసభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు తనకు స్వయంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజురాంబాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నాయకులు యర్రాకుల శ్రీనివాసరావు, దాసరి వెంకటేశ్వర్లు, మారెళ్ల వివేకానంద, బొమ్మినేని మురళీకృష్ణ, కపిల్‌బాషా, కె వెంకట్రావు, మహిళా నాయకులు తేళ్ల అరుణ, తమ్మినేని మాధవి, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

‘దాతల వివరాలు సేకరించాలి’
పర్చూరు, నవంబర్ 17 : బడి రుణం తీర్చుకోండి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని దాతల వివరాలను సేకరించి జిల్లా సర్వశిక్షా అభియాన్ కార్యాలయానికి అందజేయాలని ఎస్‌ఎస్‌ఎ జిల్లా ప్లానింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోఆర్డినేటర్ బి జాన్‌వెస్లీ సిఆర్‌పిలను ఆదేశించారు. స్థానిక ఎంఆర్‌సి భవనంలో సిఆర్‌పిలకు గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైజులా యాప్ ద్వారా పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. అలాగే పాఠశాలల్లోని పిల్లలకు విజయగాధలు చెప్పాలని కోరారు. అంతకుముందు కొల్లావారిపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీలు చేసి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పిల్లల పార్కును పరిశీలించి దాతలను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, ఉషారాణి, సిఆర్‌పిలు సాయికుమార్, ఉమామహేశ్వరరావు, కోటేశ్వరరావు, సామ్రాజ్యం పాల్గొన్నారు.
‘జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శనను విజయవంతం చేయాలి’
పొదిలి, నవంబర్ 17 : పొదిలిలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగనున్న జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనను విజయవంతం చేయాలని మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి వైఎ అమరేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం వారు ప్రదర్శన జరుగనున్న స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు అవసరమైన సలహాలు సూచనలిచ్చారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శనను జిల్లాకలెక్టర్ సుజాతశర్మ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, డిఈవో సుప్రకాష్ లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలపారు. జిల్లా వ్యాప్తంగా ఇన్‌స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు వారి మార్గదర్శకులైన ఉపాధ్యాయులు ఈ ప్రదర్శనలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన వాటిని ఈ నెల 15, 26, 27వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే రాష్టస్థ్రాయి ప్రాజెక్టు ప్రదర్శనకు పంపడం జరుగుతుందన్నారు. వారి వెంట హెడ్‌మాస్టర్లు కె మలమందారెడ్డి, పి పట్ట్భారామిరెడ్డి, పిడి వరలక్ష్మమ్మ, ఉపాధ్యాయులు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పార్లమెంటులో ప్రత్యేకహోదా అంశంపై
వైకాపా వాయిదా తీర్మానం
ఒంగోలు అర్బన్,నవంబర్ 17:ప్రత్యేకహోదా అంశంపై గురువారం పార్లమెంటులో ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా 2014 ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో ఆ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, ఇందుకు అనుగుణంగా 2014 మార్చి 1వ తేదీన కేంద్రమంత్రివర్గం ఒక నిర్ణయాన్ని తీసుకుందని వాయిదాతీర్మానంలో ఎంపి తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రానికి లోటు పూడ్చేందుకు, విభజన తరువాత జరిగిన నష్టాన్ని భర్తీచేసేందుకు ప్రత్యేకహోదా దోహదపడుతుందని ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని వాగ్ధానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాని ఇప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంపి వైవి తన వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. రూల్ 57 కింద లోక్‌సభలో వాయిదాతీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అతిత్వరలోనే దీనిపై లోక్‌సభలో చర్చ జరుగుతుందన్నారు. ఈ వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ సెక్రటరి అనుప్ మిశ్రాకు అందించటం జరిగిందని ఎంపి తెలిపారు.

జిల్లాలో పలుచోట్ల వర్షాలు
* రైతుల్లో ఆనందం

ఒంగోలు, నవంబర్ 17 : జిల్లాలోని పలుచోట్ల బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులతోపాటు, అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కంది, మిరప, పొగాకు, వరి, అలసంద తదితర పంటలను రైతులు సాగుచేశారు. ఈ వర్షాలతో పంటలకు జీవం పోసినట్లు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కాలువల్లోకి నీరు చేరింది. అదేవిధంగా వరినాట్లు వేసుకునేందుకు కూడా కొంతమంది సమాయత్తం అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పిసిపల్లిలో 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బల్లికురవ మండలంలో 36.4 మిల్లీమీటర్లు, జెపంగులూరులో 29.6, జరుగుమల్లిలో 19.2, కొండెపిలో 18.4, టంగుటూరులో 18.2, పామూరులో 14, కొత్తపట్నంలో 13.8, కందుకూరులో 10.2, కొరిశపాడులో 8.6, పొన్నలూరులో 8.4, సంతనూతలపాడులో 8.4, వెలిగండ్లలో 8, శింగరాయకొండలో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సిఎస్‌పురంలో 6.4, లింగసముద్రంలో 6.2, కొమరోలులో 5.6, వేటపాలెంలో 4.8, వలేటివారిపాలెంలో 4.4, దోర్నాల, ఒంగోలులో 4, చీరాలలో 3.6, కనిగిరిలో 1.4, మద్దిపాడు, చీమకుర్తి, రాచర్లల్లో ఒక మిల్లీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. మొత్తంమీద జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మిగిలిన ప్రాంతాల్లోని రైతులు కూడా తమ మండలాల్లో వర్షాలు కురవాలని ఎదురు చూస్తున్నారు.

ఆర్టీసీ బస్డాండ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఒంగోలు అర్బన్, నవంబర్ 17 : జిల్లాకలెక్టర్ సుజాతశర్మ గురువారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని ప్రయాణికులతో, బస్సుల కండక్టర్లతో మాట్లాడారు. చిల్లర నోట్ల సమస్యల గురించి కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంటిన్‌ను సందర్శించి అక్కడ వ్యాపారులతో చిల్లర సమస్య గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని వ్యాపారులు కలెక్టర్‌కు వివరించారు.
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి : డిఇవో
గుడ్లూరు, నవంబర్ 17: పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ సూచించారు. స్థానిక ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠ్యాంశాలు సబ్జెక్టులవారీగా ఏమేరకు పూర్తయ్యాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బోధనా పద్ధతులపై డిఇవో అవగాహన కల్పించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలకుమార్, ఉపాధ్యాయులు డి కోటేశ్వరరావు, కుటుంబరావు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
‘దేశ భవిష్యత్తు కోసమే పెద్దనోట్లు రద్దు’
దర్శి, నవంబర్ 17 : దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ నోట్లరద్దుతో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఓపికతో సహకరిస్తే భారత భవిష్యత్తు అభివృద్ధి పధంలో నడుస్తుందన్నారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వైవి లక్ష్మీనారాయణరెడ్డి, తిండి నారాయణరెడ్డి, మాడపాకుల శ్రీనివాసులు, పోతంశెట్టి బోసుబాబు, కాకర్ల ఆంజనేయులు, బీరంరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ్భారత్‌పై చిత్రలేఖన పోటీలు
కారంచేడు, నవంబర్ 17 : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. స్వచ్ఛ్భారత్‌పై గురువారం నిర్వహించిన చిత్రలేఖన కార్యక్రమాన్ని కాంప్లెక్స్ చైర్మన్ శివ కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ పోటీల్లో సుమారు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు మహిళా దినోత్సవం రోజున బహుమతులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతి, సునంద తదితరులు పాల్గొన్నారు.

శీలంవారిపల్లెకు వ్యవసాయ కళాశాల మంజూరు
సియస్‌పురం, నవంబర్ 17: మండల పరిధిలోని శీలంవారిపల్లె గ్రామానికి వ్యవసాయ కళాశాల మంజూరైనట్లు కదిరి బాబూరావు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కదిరి వెంకట ప్రకాష్‌రావు తెలిపారు. గురువారం శీలంవారిపల్లెలోని నూతన కళాశాల ఆవరణలో వ్యవసాయ కళాశాల మంజూరు పత్రాన్ని విలేఖర్లకు చూపారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన శీలంవారిపల్లెకు కళాశాలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ కోర్సులు చదివేందుకు సుదూర రాష్ట్రాలకు వెళ్ళేవారన్నారు. శీలంవారిపల్లెకు కళాశాలను మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యదర్శి కదిరి పార్ధసారధి, ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ కళాశాలను 150 ఎకరాలలో అత్యాధునిక వసతులతో నిర్మించినట్లు వారు తెలిపారు. ప్రయోగశాలలను, వసతి సౌకర్యాలను నిర్మించనున్నట్లు వారు తెలిపారు. ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం కళాశాలకు 60 సీట్లు మంజూరుకాగా అందులో 39 సీట్లు కన్వీనర్ కోటాలో మిగిలిన 21 సీట్లను మేనేజ్‌మెంట్ ద్వారా నియామకాలు జరుగుతాయన్నారు. కళాశాల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు, విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఎం శ్రీనివాసులు, అబ్దుల్లా, టి వెంకటేశ్వర్లు, పివి సుబ్బారెడ్డి, గంగరాజు, దాసయ్య తదితరులు పాల్గొన్నారు.