ప్రకాశం

జిల్లాలో పలుచోట్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 2 : బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో ఆయా మండలాల్లోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు సరాసరిగా 7.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉలవపాడు మండలంలో నమోదు అయ్యింది. అదేవిధంగా శింగరాయకొండ మండలంలో 28.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కందుకూరులో 25.2 మిల్లీ మీటర్లు , చీరాల్లో 24, పిసి పల్లిలో 23, టంగుటూరులో 20, కొరిశపాడులో 17.8, వలేటివారిపాలెంలో 17.4, అద్దంకిలో 16.4, జరుగుమల్లిలో 16.4, చిన్నగంజాంలో 15.4, పొన్నలూరులో 15.4, గుడ్లూరులో 15.2, వలేటివారిపాలెంలో 11.6, లింగసముద్రం, తాళ్లూరులో 11.2, జె పంగులూరులో 11, ముండ్లమూరులో 9.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే నాగులుప్పలపాడులో 8, కొండేపిలో 7.4, మద్దిపాడులో 7, ఒంగోలులో 6.4, చీమకుర్తిలో 6, సియస్‌పురంలో 5.2, పొదిలిలో 5.2, వెలిగండ్లలో 5, కారంచేడులో 4.6, దర్శిలో 4.6, సంతనూతలపాడులో 4.2, యర్రగొండపాలెంలో 3.4, పామూరులో 3.4, పర్చూరులో 3.2, కారంచేడులో 3, మార్కాపురం, కొమరోలులో 2.8, బల్లికురవ, దొనకొండలో 2.6, పెద్దారవీడు, త్రిపురాంతకంలో 2.4, మార్టూరు, హనుమంతునిపాడులో 2.2, కనిగిరి, తర్లుపాడు, బేస్తవారిపాలెం మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా నెలసరి సరాసరి వర్షపాతం 43.5 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 7.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఉలవపాడు, సింగరాయకొండ, కందుకూరు, సియస్‌పురం, పిసి పల్లి, టంగుటూరు తదితర మండలాల్లో రెండు సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.