ప్రకాశం

హార్టికల్చర్ హబ్‌గా జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 2: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై విద్యాశంకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక భాగ్యనగర్‌లోని ఎపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2016-17 సంవత్సరంలో 8వేల 250 హెక్టార్ల పంటలకు 58 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 6వేల 130 హెక్టార్లకు 54 కోట్ల రూపాయల సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిండం జరిగిందన్నారు. 2015 - 16 సంవత్సరంలో 6వేల 50 హెక్టార్లలో 39.4 కోట్ల సబ్సిడీతో రైతులకు ఉద్యాన పంటల్లో డ్రిప్ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. 2003 సంవత్సరం నుండి 2014 వరకు 17వేల 842 హెక్టార్లకు 72 కోట్ల సబ్సిడీతో రైతులకు బిందు సేద్యం సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రైతుల డిమాండ్ మేరకు ఎంత వరకు అయినా డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని , అందుకు సంబంధించి నిధుల కొరత లేదన్నారు. రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా డ్రిప్ సౌకర్యం కావాలని అర్జీ పెట్టుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపారు. రైతులు 35 రూపాయలు మీ సేవా కేంద్రంలో చెల్లిస్తే చాలన్నారు. ఒక్క రూపాయ కూడా ఎవరికీ చెల్లించనవసరం లేదన్నారు. దళారులను నమ్మవద్దని నేరుగా తనను కలవాలని ఆయన సూచించారు. జిల్లాలో వున్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బత్తాయి, మామిడి, మిర్చి , పప్పు్ధన్యాల పంటలకు సూక్ష్మ సాగునీటి పథకం కింద నీటి సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 5 ఎకరాల భూమి వరకు గతంలో వున్న లక్ష రూపాయల సబ్సిడీని 2 లక్షలకు పెంచామన్నారు. సన్న , చిన్నకారు రైతులు 5 ఎకరాల వరకు 90వేల నుండి 2 లక్షలకు పెంచారన్నారు. మధ్యస్థ రైతులు 5 ఎకరాల వరకు 70 శాతం వరకు 2లక్షల 80వేల వరకు సబ్సిడీ పెంచినట్లు చెప్పారు. ఇతర రైతులు 10 ఎకరాల వరకు 50శాతం సబ్సిడీని 4 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో మంజూరై వినియోగం లో లేని డ్రిప్ పరికారాల మరమ్మతులకు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ విద్యాశంకర్ తెలిపారు. ఈ విలేఖర్ల సమవేశంలో ఎపి మైక్రో ఇరిగేషన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి, ఉద్యావనశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.