ప్రకాశం

జిల్లాకు 0.5 టిఎంసిల నీరు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 7 : జిల్లాకు మరో 0.5 టిఎంసిల నీరు అవసరం ఉందని, ఆ నీటితో చెరువులన్నింటిని పూర్తిస్థాయిలో నింపుకుంటామని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సమస్యలు, వడగాలులు, జలవనరులు, గ్రామీణ ఉపాధిహామీ పథకం, ఇసుకపాలసీ, ఎన్‌టిఆర్ వైద్యసేవలు, వ్యవసాయం, గృహనిర్మాణం, సిసిరోడ్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు రెండు టిఎంసిల నాగార్జునసాగర్ జలాలు వచ్చాయన్నారు. ఆ జలాలతో జిల్లాలోని 200 చెరువులను 70 శాతం నుంచి 80 శాతం నింపుకున్నామన్నారు. అయితే ఇంకా పట్టణ ప్రాంతాల్లో చెరువులను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటితో వచ్చే మూడునెలలు తాగునీటి సమస్య లేకుండా చూసుకోగలమన్నారు. జిల్లాలో నీటిఎద్దడి నివారణకు 9.49 కోట్ల రూపాయల నాన్ సిఆర్‌ఎఫ్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రణాళికబద్ధంగా నీటిని పొదుపుగా వినియోగించుకుని ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల్లో 280 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తీసినట్లు తెలిపారు. తద్వారా 87 కోట్ల రూపాయల విలువైన పనులు చేశామన్నారు. ప్రస్తుతం 261 పనులు మంజూరు చేశామని, ఇందుకోసం 74 ప్రొక్లెయిన్లు ఇప్పటికే వినియోగిస్తుమన్నారు. పంట సంజీవిని కింద 12 వేల సేద్యపు నీటికుంటల తవ్వకాల పనులు మొదలుపెట్టామని, 3500 కుంటల నిర్మాణం పూర్తిచేశామన్నారు. అలాగే గత సంవత్సరం 216 కిలోమీటర్ల సిసిరోడ్ల నిర్మాణానికి గాను 225 కిలోమీటర్ల రోడ్లు పూర్తిచేశామన్నారు. ఈ సంవత్సరం 160 కిలోమీటర్ల సిసిరోడ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.