ప్రకాశం

నేటి నుండి బయటమార్కెట్‌లో పాత 500 నోటుకు చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 2:కేంద్ర ప్రభుత్వం పాత ఐదువందల నోట్ల రూపాయల బయట చలామణిని శుక్రవారం అర్ధరాత్రినుండి రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఆ కాగితాలు ఇకపై చిత్తుకాగితాలుగా మారనున్నాయి. పాత నోట్లు ఇకపై పెట్రోలుబంకుల్లో ఇతర మార్కెట్‌లో చెల్లకుండాపోనున్నాయి. ఇప్పటివరకు చిల్లర సమస్యతో అల్లాడిపోయిన వాహనదారులకు టోల్‌గేట్ల వద్ద ఊరటనిచ్చిన కేంద్రప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుండి వసూలు చేసుకునే విధంగా ఆదేశాలు జారీచేసింది. ఈనేపధ్యంలో చిల్లరకోసం శనివారం నుండి వాహనదారులు టోల్‌గేట్ల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయట మార్కెట్‌లో పాత ఐదువందల నోటు చలామణిలోకి రాకపోతుండటంతో కొంతమంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ నగదును బ్యాంకుల్లో వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటివరకు బయట మార్కెట్‌లో చలామణిలో ఉన్న ఐదువందల రూపాయల నోటు బ్యాంకుల్లోనే దర్శనమివ్వనుంది. కాగా ఆర్‌టిసి ప్రయాణికులకు మాత్రం ఊరట కల్పించారు. ఈనెల 15వతేదీవరకు ఆర్‌టిసి బస్సుల్లో ఐదువందల రూపాయల నోటు చలామణిలో ఉండటంతో కొంతమేర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో పాత వెయ్యిరూపాయల నోట్లను కేంద్రప్రభుత్వం రద్దుచేసింది. ఈ నేపధ్యంలో బయట మార్కెట్‌లో వెయ్యిరూపాయల నోటు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లనుఈనెల 31వతేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే విధంగా కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపధ్యంలో బ్లాక్‌మనీ ఉన్నవారు తమ నగదును బయటకు తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది తమ దగ్గర ఉన్న బ్లాక్‌మనీని వైట్‌మనిగా మార్చుకునేందుకు అడ్డదారులన్ని తొక్కుతున్నారు. కొంతమంది లక్షరూపాయల బ్లాక్‌మనికి 25శాతం మేర వైట్ మనీని ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దపెద్దబడా వ్యాపారులు, బిగ్‌షాట్‌లు మాత్రం నగదును మార్చుకునేందుకు కొత్త అకౌంట్ల ద్వారా మనీని సర్కూలేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిఇలాఉండగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద మాత్రం ఖాతాదారులు క్యూలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదయంనుండి సాయంత్రం వరకు నగదుకోసం ఖాతాదారులు పడిగాపులు కాస్తున్న కొంతమందికి నగదు అందని పరిస్ధితి నెలకొంది. మొత్తంమీద ఈ అర్ధరాత్రి నుండి పాత ఐదువందల రూపాయల నోటుకు కాలం చెల్లినట్లైంది. త్వరలో ఖాతాదారులకు తగ్గట్లుగా ఆర్‌బిఐ కొత్త నగదును పంపించాలని అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.