ప్రకాశం

రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 13 : జిల్లాలో వార్ధా తుఫాన్ ప్రభావం వల్ల రాబోయే 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో తన ఛాంబర్ నుండి తహశీల్దార్లతో ఇన్‌చార్జి కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వార్ధా తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో కందుకూరు డివిజన్‌లో అధిక వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు ఎప్పటికప్పుడు వర్షపాతం వివరాలు తెలియజేయాలన్నారు. వర్షం వల్ల కాలువలు, బ్రిడ్జిల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఇరిగేషన్ చెరువులు తెగిపోకుండా అక్కడ ఇరిగేషన్ సిబ్బందిని నియమించి అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే వర్షపునీరు వృధాగా పోకుండా సాగునీటి చెరువులకు మళ్లించి నింపుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కందుకూరు డివిజన్‌లో లింగ సముద్రం మండలంలో 108 మిల్లీ మీటర్లు, వివి పాలెం 104 మి.మీ. కందుకూరు 145, వెలిగండ్ల 145 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. డివిజన్‌లో అధిక వర్షం వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనాలు తయారు చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇపిడిఎస్ కింద జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ నెల 15వ తేది నాటికి నిత్యావసర సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 20వ తేది నుండి చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు