ప్రకాశం

రోడ్డుపై పాఠాలు బోధించి కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 13: ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వీస్ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ కంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టరేట్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు జిల్లా కలెక్టరేట్ అయిన ప్రకాశం భవనం ఎదుట రోడ్డుపై విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా జె ఏసి ప్రతినిధులు కె సురేష్ , పి మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ , పాలిటెక్నిక్ కళాశాలల్లో పాఠాలు బోధించాల్సిన తమను ప్రభుత్వం వీధికెక్కేలా చేసిందని వారు ఆరోపించారు. 16 ఏళ్ళుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను ఫ్రభుత్వం కరివేపాకులా ఉపయోగించుకోని వదిలేసిందన్నారు. క్షణక్షణం ఉద్యోగభద్రత లేకుండా పనిచేయాల్సివచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలో పాఠాల బోధనలో జె ఏసి ప్రతినిధులు ఆర్ సిహెచ్ రంగయ్య , పిల్లి సుబ్బారెడ్డిలు పాఠంబోధిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విద్యార్థులకు వివరించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల అధ్యాపకుల సంఘం నాయకులు విఎల్‌పి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల వల్లనే ప్రభుత్వ కళాశాలల మనుగడ సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యమ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్‌ను క్రమబద్దీకరించడం ద్వారానే వారికి ఉద్యోగ భద్రత కలుగుతుందన్నారు. మంగళవారం దీక్షలో కూర్చున్న వారిలో పి కరీంఖాన్, షేక్ ఖాదర్‌వలి, జె ఈశ్వరుడు, జి ఆనంద్, హజరత్తయ్య, వెంగళరావు,బుజ్జిబాబు, ఐ సుజాత, కె ధనలక్ష్మి, పద్మావతి తదితరులు ఉండగా ఈ కార్యక్రమంలో ఎస్ కృష్ణయ్య, బి కాశీరత్నం, వై జాన్‌బాబ్, టి వాసుబాబు, సుబ్రమణ్యం , విజయలక్ష్మి, ఎస్తేరమ్మ, జయసుధ, సుమలత, కుసుమకుమార్ తదితరులు పాల్గొన్నారు.