ప్రకాశం

వైకాపా గూటికి కాంగ్రెస్ మాజీ నేతలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 16:జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బలహీనంగా ఉండటంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ మాజీ ముఖ్యనేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌పేరుతో చర్యలు తీసుకుంటారా అన్న చర్చ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేతలు జిల్లాలో కూడా ఉన్నారు. వారిని తమపార్టీ వైపు తిప్పుకునేందుకు వైకాపా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నాయకులు వైకాపాలోకి చేరితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీబలం పెరిగే అవకాశం ఉందన్న వాదన ఆ పార్టీ నేతల నుండే వినిపిస్తుంది. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకుంటే మాత్రం ఆ నియోజకవర్గంలో పార్టీ పరుగులు పెడుతుందన్న వాదన వినిపిస్తోంది. గతంలోనే వైకాపాలో మానుగుంట చేరతారన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. కాని అనివార్యకారణాల వలన ఆయన వైకాపా తీర్థం పుచ్చుకోకపోవటంతో వైకాపా అధిష్టానవర్గం కందుకూరు నియోజకవర్గం వైకాపా ఇన్‌చార్జిగా తుమాటి మాధవరావును నియమించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. త్వరలో కందుకూరు మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగితే మహీధర్‌రెడ్డి తన స్వంత ప్యానల్‌ను పోటీలోకి దించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు తారుమారుఅయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మహీధర్‌రెడ్డి వైకాపా గూటికి చేరితే మాత్రం ఆ పార్టీ బలం నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలపై కూడా ఆయన ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా కనిగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో దూరంగా ఉన్నారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి కూడా వైకాపాకి దూరంగా ఉంటూ తన వ్యాపారాల లావాదేవీల్లో మునిగి తేలుతున్నారు. వీరిద్దరి ప్రభావం నియోజకవర్గంలో ఎంతో ఉంది. ఈపాటికే కాశిరెడ్డి వైకాపాలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించటం లేదు. వీరు ఇద్దరు వైకాపాకి కనిగిరిలో ఎంతో అవసరం అన్న భావన ఆ పార్టీనేతల్లోనే వ్యక్తవౌతుంది. దీంతో జగన్ ప్రత్యేక దృష్టిసారించి ఉగ్రను పార్టీలోకి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటారా లేక కిమ్మనకుండిపోతారా అన్న చర్చ సాగుతుంది. అదేవిధంగా కాశిరెడ్డి కూడా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంనుండి శాసనసభ్యునిగాను, మంత్రిగాను, జిల్లా పరిషత్ చైర్మన్‌గాను,జిల్లాపార్టీ అధ్యక్షునిగాను కాశిరెడ్డి పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయన సేవలు వైకాపాకి ఎంతో అవసరం ఉందన్న వాదన రాష్టప్రార్టీ నుండే వినిపిస్తున్నాయి. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లోని కొంతమంది కాంగ్రెస్‌పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మాజీ శాసనసభ్యులతోపాటు, మాజీ ఎంపిపిలు, మాజీ జడ్‌పిటిసిలను తమపార్టీవైపు ఆపరేషన్ ఆకర్ష్‌పేరుతో వైకాపా గూటికి చేర్చుకుంటారా అన్న చర్చ సాగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండుసంవత్సరాలకుపైగా గడువు ఉండటంతో ముందుగానే ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ తాజా, మాజీ తమ్ముళ్లను చేర్చుకుంటారా లేక వదిలివేస్తారా అన్న వైకాపా తమ్ముళ్లనుండి వినిపిస్తోంది.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆపరేషన్ ఆకర్ష్‌పేరుతో తెలుగుతమ్ముళ్లను భారీగా తమపార్టీవైపు చేర్చుకుని పార్టీబలాన్ని పెంచారు. అదే ఫార్ములాను జగన్ చేపడ్తారా లేక కిమ్మనకుండపోతారా అన్న చర్చ పార్టీశ్రేణుల నుండి వ్యక్తవౌతుంది.

జిల్లాలో నేరాలకు పాల్పడిన నిందితులు అరెస్ట్
సుమారు రూ.9,20,000 చోరీ సొత్తు స్వాధీనం
ఎస్‌ఎన్ పాడు హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ఒంగోలు, డిసెంబర్ 16: జిల్లాలో జరిగిన 36 కేసుల్లో తొమ్మిదిమంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది మోటారుసైకిళ్లు, 320కేజిల కాపర్ వైరు, 210కేజిల అల్యూమినియం, 67సెల్‌ఫోన్లు, 15మెమెరీకార్డులు, ఏడు కంప్యూటర్లు (వాటిపరికారాలు),ఒక వీడియోకెమెరా, ఒక హోం థియేటర్ మొత్తం కలిపి సుమారు తొమ్మిదిలక్షల 20వేల రూపాయల విలువైన చోరీ సొత్తుకు సంబంధించి సంబంధిత పోలీసు అదికారులు నిందితులను అరెస్టుచేసి చోరి సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చనన్నట్లు ఎస్‌పి త్రివిక్రమవర్మ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి వివరాలను ఎస్‌పి శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివరించారు. ఎస్‌పి త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ఒంగోలు సబ్‌డివిజన్ పరిధిలోని సంతనూతలపాడు పోలీసుస్టేషన్‌కు సంబంధించి ఒక హత్యకేసులోని నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం గుండ్లాపల్లిగ్రామానికి చెందిన రమావత్ ఏసునాయక్ అనే ఆటోడ్రైవర్‌ను అరెస్టుచేసి కేసును చేధించినట్లు తెలిపారు. ఒంగోలు బాలాజిరావుపేట మంగమూరుడొంకలో నివాసం ఉంటున్న వైశ్య సామాజికవర్గానికి చెందిన మువ్వల వెంకటసుబ్బారావు (42)అనే వ్యక్తి సుబ్బు మొబైల్ షాపును మంగమూరుడొంక వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యక్తిని సంతనూతలపాడు మండలం మంగమూరు శివారుప్రాంతంలో ఇటీవల హత్య చేసినట్లు ఎస్‌పి పేర్కొన్నారు. నిందితుడు హత్యచేసిన మూడురోజుల తరువాత మృతునికిచెందిన షాపును తెరిచి అందులోని 62 సెల్‌ఫోన్లు, ఏడువేల మెమోరి కార్డులు, ఒక మోటారుసైకిల్‌ను దొంగిలించుకుపోయినట్లు తెలిపారు. ఈ నిందితుడిని అరెస్టుచేసి చోరీ చేసిన 62 సెల్‌ఫోన్లు, 15మెమోరికార్డులు, ఒక మోటారుసైకిల్, వెయ్యిరూపాయల నగదును కలిపి మొత్తం సుమారు ఒకలక్షా 70వేల రూపాయల విలువచేసే సొత్తును సంతనూతలపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన ఒంగోలు పట్టణ డిఎస్‌పి జి శ్రీనివాసరావు, రూరల్ పోలీసుస్టేషన్ సిఐ మురళీకృష్ణ, సంతనూతలపాడు ఎస్‌ఐ హుస్సేన్‌బాను జిల్లా ఎస్‌పి అభినందించారు. అలాగే పలు కేసులను చేధించిన పోలీసులును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో నేరాలు తగ్గుముఖం : ఎస్‌పి
పొదిలి, డిసెంబర్ 16 : జిల్లాలో పోలీసులు చేపట్టిన విజిబుల్ పోలిసింగ్ విధానం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్‌పి డాక్టర్ త్రివిక్రమవర్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పొదిలి పోలీస్ స్టేషన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నేరాల అదుపుపైనే కాకుండా పోలీసులు ఇతర సామాజిక సేవల్లో కూడా పాలు పంచుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ఆయన ప్రసంశించారు. వార్థ తుపాన్ సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున తీర ప్రాంతాలను మొహరించి ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. జిల్లాలో నేరాల అదుపు కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 800 ప్రదేశాలను గుర్తించి వాటిలో సిసి కెమెరాలు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. కాగా వెయ్యి సిసి కెమెరాల మంజూరు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. అవి మంజూరు జరిగితే నేరాలు జరిగే ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను మరింత అదుపు చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్లకు సంబంధించిన స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వినియోగించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎస్‌పి తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒంగోలు - కొత్తపట్నం రహదారి మధ్యలో పోలీస్ స్టేషన్‌కు చెందిన స్థలంలో పెట్రోల్‌బంకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇదే విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఎస్‌పి తెలిపారు. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న మర్రిపూడి, తాళ్లూరు, యద్ధనపూడి, సంతమాగులూరు మండలాల్లో పోలీస్ స్టేషన్లకు కొత్త భవన నిర్మాణాలకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మర్రిపూడి పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్లు చెప్పారు. అనంతరం ఎస్‌పి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు, పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్‌ఐఆర్ రాంబాబు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో
కానిస్టేబుల్ మృతి
చీరాలరూరల్, డిసెంబర్ 16: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శుక్రవారం స్థానికంగా చోటుచేసుకుంది. వన్‌టౌన్ సిఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న గుత్తి సునీల్‌కుమార్(34) బల్లికురవ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి చీరాల రైల్వేస్టేషన్‌లో దిగి తన బైకుపై ఇంటికి వెళ్తున్నాడు. పోలీసు క్వార్టర్స్ ఎదురుగా ఆర్వోబిపై ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతని తల వెనుకభాగంలో బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతని మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు.