విశాఖపట్నం

న్యాయవిద్యకు ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: న్యాయవ విద్యకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని, సమాజంలో మంచి గుర్తింపుతోపాటు గౌరవ మర్యాదలూ లభిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ తెలిపారు. శనివారం అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాల యం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ గతంలో న్యాయ విద్య నిర్లక్ష్యం చేయబడిందని, ఆఖరి అవకాశంగా మాత్రమే న్యాయ విద్యను చదివేవారన్నా రు. అయితే ప్రస్తుతం మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారన్నారు.ప్రస్తుతం అనేక రంగాల్లో న్యాయ నిపుణులు అవసరం అవుతున్నారని, ఇది చదివిన న్యాయవాదులుగానే వెళ్ళాలని గొప్ప వేతనాలందుతున్నాయని వేరే రంగాల్లోకి వెళ్ళకూడదని హితవు పలికారు. దీర్ఘకాలంలో దీనివలన ప్రయోజనాలుంటాయన్నారు. దేశంలో 18 యూనివర్సిటీలు ఉన్నాయని, ఇందులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల నుండి కేవలం రెండు వేల మంది మాత్రమే విద్యార్థులు చదువుతున్నారన్నారు. 60 వేల మంది సాధారణ విద్యనందుకుంటున్నారన్నారు. ఉత్తమ సౌకర్యాలు, ఉపాధ్యాయులు, వౌలిక వసతులు ముఖ్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు న్యాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నందుకు అభినందించారు. నాణ్యమైన విద్యను అందుకున్న వారు నాణ్యమైన సేవలందిస్తారని, సత్వర న్యాయం ప్రజలకు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి బార్ అసోసియేషన్లు ఉంటే న్యాయమూర్తులకు కూడా ఉపకరిస్తుందన్నారు. న్యాయవాదులు ఉత్తమ సీనియర్ల వద్ద చేరి చట్టాలపై అవగాహన చేసుకోవాలన్నారు. స్వదేశంలోనే వారి పరిజ్ఞానాన్ని అందించాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రతిభను పెంచేలా చూడాలన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్నారన్నారు. మహిళా న్యాయ అధికారులు, న్యాయవాదులు 50 శాతం ఉన్నారని వారు ఉత్తమ సేవలందిస్తున్నారన్నారు. క్రీడల్లో కూడా వారి సత్తా చాటుతున్నారని, జీవితం మారథాన్ వంటిదని, దానికి ఒక మోడల్ మంచి ప్రారంభమని దానికోసం పరుగు పెట్టాలన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ యువతకు ఏపీలో అవకాశాలు అనేకం ఉన్నాయని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా సాగిపోవాలన్నారు. న్యాయ విద్యార్థులు భవిష్యత్‌లో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందేలా చూడాలన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి సంజీవయ్య పేరు సార్థకమయ్యేలా ఇక్కడి విద్యార్థులు పనిచేయాలన్నారు. ఇంతవరకు మీ వెంట ఉపాధ్యాయులు ఉన్నారని, ఇకపై మీరు బహిరంగ మార్కెట్లోకి వెళ్తారని, మీలో కొందరు ప్రధాన న్యాయమూర్తులు కూడా కావాలని ఆకాంక్షించారు. గతంలో విద్యావకాశాలు పరిమితంగా ఉండేయని, కొద్దిమంది మాత్రమే లా చదివేవారన్నారు. ప్రస్తుతం న్యాయసేవల పరిమితులు విస్తృతమయ్యాయని, అనేక కంపెనీల్లో అవకాశాలు వస్తున్నాయన్నారు. ఆర్థిక సంస్కరణల తరువాత అనేక మార్పులు దేశంలో జరిగాయని, మరో 20ఏళ్ళల్లో భారత్, చైనా, అమెరికా దేశాలు మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తాయన్నారు. ఐటిలో భారతదేశం ముందుందని, దేశంలో ప్రస్తుతం తీసుకువస్తున్న సంస్కరణలు దేశాభివృద్ధికి తోడ్పడేవిగా ఉన్నాయన్నారు. దేశంలో ఇంగ్లీష్‌భాషలో నైపుణ్యం ఉండటంతో ప్రపంచంలో భారత్‌కు విస్తృత మార్కెట్ ఉంటుందన్నారు. మొదటి పారిశ్రామిక విప్లవం వ్యవసాయాభివృద్ధికి జరిగితే, ప్రస్తుతం నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా టెక్నాలజీ ద్వారా రియల్‌టైం అభివృద్ధి, రియల్ టైం సమాచారం అందుబాటులోకి వచ్చిందన్నారు. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, లా యూనివర్సిటీ ఛాన్సలర్ రమేష్ రంగనాథన్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వైస్-్ఛన్సలర్ కేశరవా యూనివర్సిటీ నివేదికను అందించారు. ఈ స్నాతకోత్సవంలో డాక్టర్ ఆఫ్ లా చదివిన ముగ్గురు విద్యార్థులకు, మాస్టర్ ఆఫ్ చదివిన మరో ఐదుగురు న్యాయ విద్యార్థులకు డిగ్రీ పట్టాలనందచేశారు. 2,3వ స్నాతకోత్సవంలో న్యాయ విద్యార్థులకు పట్టాలతోపాటు బంగారు పతకాలను అందజేశారు.
* దివ్వాంగురాలు మానసకు అభినందనలు
లా డిగ్రీ విద్యార్థుల్లో దివ్యాంగురాలైన పతివాడ మానసను జిల్లా జడ్జి పివి జ్యోతిర్మయి, ఇతర మేజిస్ట్రేట్‌లు అభినందించారు. మానస నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ రామస్వామినాయుడు మనమరాలు కావడం విశేషం. ఈ కార్యక్రమం యూనివర్సిటీ సెనేట్ సభ్యులు, అకడమిక్ సభ్యులు, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కంభంపాటి హరిబాబు, జెడ్‌పి చైర్‌పర్సన్ లాలం భవానీ, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు జ్యుడిషియల్ అధికారులు హాజరయ్యారు.

విశ్వసనీయత నిలబెట్టుకోవాలి
* బార్ అసోసియేషన్‌కు
సుప్రీం చీఫ్ జస్టిస్ ఠాకూర్ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 17: న్యాయవాదులపై ప్రజలకు అపార విశ్వా సం ఉందని, వారి ఆశలకనుగుణంగా పనిచేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన సభా కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధికి న్యాయ వ్యవస్త తోడ్పడేలా పనిచేయాలని, సత్వరమైన న్యాయాన్ని నిజాయితీగా అందించాలని, న్యాయవాదులను ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బార్ అసోసియేషన్ సహకారం లేకపోతే న్యాయ వ్యవస్థ మనలేదని, న్యాయ వ్యవస్థను నిలబెట్టడానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు నిరంతరం కృషిచేయాలన్నారు. గత ఏడాదిలో 126 మంది హైకోర్టు జడ్జీ లను ప్రభుత్వం నియమిచిందని, న్యాయశాఖ అభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తున్నట్టు తెలిపారు. కింద కోర్టులో ప్రాక్టీసు చేసే వారికిపై కోర్టుల్లో అవకాశాలు వస్తాయని, అనుభవంతోపాటు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయని, నిజానికి హైకోర్టు కంటే జిల్లా కోర్టుల్లో పనిచేసే వారికే అపారమైన నాలెడ్జ్ ఉంటుందన్నారు. విశాఖపట్నంలో మహిళా న్యాయవాదులు ఎక్కువుగా ఉన్నారని, మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, జమ్మూ, కాశ్మీర్‌లో 50 శాతం మంది మహిళా న్యాయవాదులున్నారని, ఏపీలో కూడా అలా ఎదగాలన్నారు. భారతదేశం త్వరగా అభివృద్ధిచెందుతున్న దేశమని, అనేక సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడుస్తుందని, త్వరలో ఆ ఫలాలు పేదలకు చేరబోతున్నాయన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, అడ్వకేట్ జనరల్ డి.శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ, హైకోర్టు న్యాయమూర్త సునీల్ చౌదరి, జిల్లా జడ్జి ప్రియదర్శిని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుమన్, సెక్రటరీ స్వామి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులను ప్రధాన న్యాయమూర్తులు సత్కరించారు.

ఊపిరి సలపని కార్యక్రమాలు-కీలక భేటీలు
* 10 గంటలు 7 కార్యక్రమాలు * ఫార్మా, ఐటి సిఇఓలతో ముఖాముఖి * రోజంతా సిఎం చంద్రబాబు బిజీబిజీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 17: ఊపిరి సలపని కార్యక్రమాలు. ఫార్మా, ఐటి కంపెనీల అధినేతలతో కీలక భేటీలు.మధ్యలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసి మాటామంతీ, సాదర సత్కారం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాటి నగర పర్యటన తీరు. ఉదయం 9.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు గంట లేటుగా నగరానికి చేరుకున్నారు. వస్తూనే విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో నిర్మించిన చిల్డ్రన్స్ ఎరీనాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు. అవకాశం లభిస్తే ప్రసంగించేందుకు వెనుకాడని చంద్రబాబు నగరంలోని తొలి కార్యక్రమంలో వౌనంగానే ఉన్నారు. అక్కడ నుంచి ఎయు ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 68వ ఫార్మసీ కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. అవకాశాలు, వనరులు పుష్కలంగా ఉన్న నవ్యాంధ్రలో ముఖ్యంగా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. అనంతరం అక్కడే ఫార్మా కంపెనీల సిఇఓలతో చర్చించారు. వారి సమస్యలు ఆలకించి, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వివరించి ఆకర్షించే ప్రయ త్నం చేశారు. అనంతరం రుషికొండ హిల్ 2లో నిర్మించిన ఫిన్‌టెక్ వ్యాలీని, అందులో కార్యకలాపాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఐదు సంస్థలను ప్రారంభించారు. అక్కడే కొన్ని సంస్థలతో కంపెనీలు ప్రారంభించేందుకు అంగీకరిస్తూ చేసుకున్న ఒప్పందాలకు వారధిగా నిలిచారు. ఫిన్‌టెక్ వ్యాలీకి అవసరమయ్యే మానవ వనరుల కల్పనకు గాను పలు విద్యా సంస్థలతో ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. అక్కడే పలు జాతీయ,అంతర్జాతీయ ఐటి కంపెనీల అధినేతలు, వాణిజ్య బ్యాంకుల ఉన్నతాధికారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. పలు అంశాలపై వారి సలహాలు, సూచనలు తీసుకున్న చంద్రబాబు, వారి సమస్యలపైనా సానుకూలంగానే స్పందించారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విశ్రాంతి తీసుకోకుండానే నేరుగా నోవాటెల్ హోటల్‌లో బసచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఎస్ ఠాకూర్‌ను స్వయం గా కలుసుకుని ముచ్చటించారు. ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వం తరఫున సత్కరించారు. అక్కడ నుంచి నేరుగా పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన విండ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. చివరగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిఎం సుదీర్ఘ పర్యటనకు తెరపడింది. అనుకున్న సమయానికే చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరుగుపయనమయ్యారు.
అధికారుల హైరానా!
చంద్రబాబు నాయుడు పర్యటన అంటేనే నగరంలో అధికార యంత్రాంగానికి హైరానా తప్ప దు. అటువంటిది ఒకే రోజు ఆరేడు కార్యక్రమా ల్లో పాల్గొనడం అంటే ఇక అధికారుల పరస్థితి అర్థం చేసుకోవాలి.