ప్రకాశం

బాబాయికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 19:తన సొంత బాబాయ్ అయిన వైకాపా రాష్ట్ర ముఖ్యనాయకుడు, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డికి మాట్లాడేందుకు జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇవ్వకపోవటం పట్ల సర్వత్రావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైదంటూ వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్టవ్య్రాప్తంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా జగన్ ఒంగోలులో పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా జిల్లాలోని అన్నినియోజకవర్గాల నుండి వైకాపానాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగన్ వచ్చేందుకు ఆలస్యం ఉండటంతో స్టేజిపై ఉన్న ముఖ్యనాయకులతోపాటు, కొంతమంది నాయకులు కూడా ప్రసంగించారు. కాగా జగన్ స్టేజి ఎక్కిన తరువాత జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు, మరికొంతమంది శాసనసభ్యులు, ఇన్‌చార్జులు, ఇతర ముఖ్యనేతలతో మాట్లాడించారు. కాని ఇక్కడే ట్విస్టు ఉందనే చెప్పవచ్చు. అందరు మాట్లాడిన తరువాత జగన్ రాష్ట్రప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. జగన్‌ప్రసంగంపై అన్నిశ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కాని ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లాకేంద్రానికి పార్లమెంటుసభ్యునిగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో ఆనాటినుండి అధిష్టానంపై మండిపడుతూనే ఉన్నారు. కనీసం పార్లమెంటు ఎంపిగా ఉండి కూడా వైవి ఎందుకు మాట్లాడలేదు, కావాలనే మాట్లాడినవ్వలేదా, సమయం తక్కువుగా ఉందని మాట్లాడనివ్వలేదా అన్న ప్రశ్నలు పార్టీనేతల నుండి వ్యక్తంవౌతున్నాయి. ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కావటం లేదంటూ కొంతమంది జగన్ దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఎంపి వైవి జగన్‌కు సమస్య తీవ్రతను తెలియచేస్తునే ఉన్నారు. జగన్ పక్కనే ఎంపి వైవి ఉన్నప్పటికి మాట్లాడేందుకు మాత్రం అవకాశం దొరకలేదు. ఆందోళన కార్యక్రమం ముగిసిన వెంటనే జగన్‌తోపాటే కారులో విజయవాడకు వెళ్లారు. కాని ఆందోళన కార్యక్రమంలో మాత్రం వైవికి చోటుదక్కకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిఇలాఉండగా జగన్‌మోహన్‌రెడ్డి వివిధ కేసుల్లో చంచలగూడ జైలులో ఉన్న సమయంలోను, జగన్‌ఓదార్పుయాత్ర సమయంలోను వైవి సుబ్బారెడ్డి కీలకపాత్రపోషించి అన్ని తానై వ్యవహరించారని పార్టీనాయకులు చెబుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా జగన్‌చేపట్టిన ఓదార్పుయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం అయిందంటే దానిలో కొంతపాత్ర వైవిది లేకపోలేదు. అదేవిధంగా జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గపరిధిలోని ఆదిమూర్తిపల్లెనుండి కావలి వరకు జరిగిన జగన్ ఓదార్పుయాత్రలో ఎంపి వైవి కీలకపాత్రపోషించారు. ఏదిఏమైనప్పటికి ఒంగోలులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో వైవికి మాట్లాడేందుకు అవకాశం దక్కకపోవటంతో వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయని రానున్న ఎన్నికల్లో అధికారం రావాలంటే అన్నివర్గాలను కలుపుకుపోవాల్సిన అధిష్టానవర్గం ఈవిధంగా వ్యవహరించటం ఏమిటన్న చర్చ సాగుతుంది. స్వంతబాబాయికే మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోతే తమ పరిస్ధితి ఏమిటన్న సందిగ్ధంలో కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా సమయం తక్కువుగా ఉండటంతో తానుమాట్లాడతానులే చిన్నాన్న అంటూ ఎంపికి చెప్పి జగన్ మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాని లోలోపల అంతర్గతంగా ఏం రాజకీయం జరిగిందో ఆ దేవుడికే తెలియాల్సి ఉంది.