ప్రకాశం

గ్రీవెన్స్‌డే అర్జీలను సత్వరమే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 19:జిల్లాలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రజాసమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో ఆయన అధ్యక్షతన గ్రీవెన్స్‌సెల్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మీకోసం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో అర్జీలు పరిష్కరించటంలో మొదటిస్థానంలో నిలిచామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలు, మీసేవా కేంద్రాల్లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంనుండి వచ్చిన అర్జీలను గడువులోగా పూర్తిచేయాలన్నారు. వచ్చేనెల నుండి రెండవతేదీనుండి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరుగుతుందన్నారు. గత జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. పరిష్కరించని అర్జీలపై తీసుకున్న చర్యలపై ఎటిఆర్‌ఒ తయారుచేయాలన్నారు. జన్మభూమిలో గృహనిర్మాణ లబ్ధిదారులకు నివేసన స్థలాల పట్టాల పంపిణీ పొజిషన్ సర్ట్ఫికెట్లు పంపిణీ చేసేందుకు నియోజకవర్గస్థాయి, మండలస్థాయి లబ్ధిదారుల జాబితాను తయారుచేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేసుకోవాలన్నారు.కొత్తపట్నం మండలం కెపల్లెపాలెం గ్రామానికి సిండికేట్ బ్యాంకు దత్తత తీసుకుని గ్రామం మొత్తం నగదురహిత గ్రామంగా ప్రకటించామన్నారు.నిత్యావసర సరుకులు అందించేందుకు అన్ని చౌకధరల దుకాణాల్లో ఈపాస్ మీషన్లు ఏర్పాటుచేస్తామన్నారు.మునిసిపల్ మార్కెట్‌లో సరుకులు, వస్తువులు కొనుగోలుచేసేందుకు స్వైపింగ్‌మీషన్లు ఏర్పాటుచేయాలన్నారు. స్వైపింగ్ మిషన్లు అమలుచేసేందుకు ఇంజనీరింగ్ కాలేజిల విద్యార్థులతో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లారెవెన్యూ అధికారి భక్తవత్సలరెడ్డి, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళీ, వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.