ప్రకాశం

జిల్లాకు సాగర్ జలాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 20:రాష్ట్రప్రభుత్వం నాగార్జున సాగర్ నుండి జిల్లాకు ఏడు టిఎంసిల నీటిని మంగళవారం ఉదయం 11గంటలకు విడుదల చేసింది. ఈ సాగర్ జలాలు తొలుతగా గుంటూరు జిల్లాలోని బుగ్గవాగు నుండి అనంతరం త్రిపురాంతకం 85/3 మైలురాయి వద్ద నుండి జిల్లాకు రానున్నాయి. సాగర్ జలాలు జిల్లాకు వచ్చేసరికి నాలుగురోజుల సమయం పడుతుందని ఎన్‌ఎస్‌పి అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి, సాగునీటి సమస్య ఈ జలాలతో పరిష్కారం కానుంది. జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగుచేశారు. రైతులు సాగుచేసిన పంటలు ఎండిముఖం పడుతున్నారు. ఇటీవల వర్ధా తుపాన్ ప్రభావంతో కేవలం కందుకూరు డివిజన్‌లో మాత్రమే భారీ వర్షాలు కురవగా మిగిలిన ప్రాంతాల్లో నామమాత్రంగానే వర్షాలు కురిశాయి. దీంతో రైతులు సాగుచేసినపంటలు వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని 25మండలాల్లో ఎక్కువుగా కంది, పత్తి, పొగాకు, శనగ పంటలను రైతులు సాగుచేశారు. అదేవిధంగా 7500ఎకరాల్లో వరిపంటను రైతులు సాగుచేసి నీటికోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. విడుదలైన సాగర్ జలాలు పంటలకు జీవం పోయనుంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచినీటి చెరువులను సాగర్ జలాలతో అధికారులు నింపనున్నారు. జిల్లావ్యాప్తంగా మంచినీటి సమస్య జఠిలంగా ఉంది. మంచినీటి కోసం జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మంచినీటి కొరతతో మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులకు మాత్రం కాసుల వర్షం కురుస్తుంది.
ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరవాసులకు దాహర్తి తీరనుంది. ప్రస్తుతం నగర వాసులకు రెండు నుండి మూడురోజులకు మంచినీటి సరఫరాను కార్పొరేషన్ అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల్లో సైతం సమృద్ధిగా నీరు లేదు. ఇలాంటి తరుణంలో ఈ సమ్మర్‌స్టోరేజి ట్యాంకులు నిండితే నగర వాసులు దాహార్తి పూర్తిగా తీరనుంది.
కాగా జిల్లాలోని రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన నాగార్జున సాగర్ నీటిని అధికారులు సమన్వయంతో వ్యవహరించి జిల్లాలోని పంటలను కాపాడాల్సి ఉంది. అదేవిధంగా మంచినీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపాల్సి ఉంది. కాని ముందుగా గుంటూరు జిల్లా నుండి సాగర్ నీరు జిల్లాలో ప్రవేశించాల్సిఉంది. దీంతో జిల్లాకు రావాల్సిన వాటాను సైతం గుంటూరు రైతులు తరలించుకుపోయే పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం ఇదేతంతు జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఎన్‌ఎస్‌పి అధికారులు, రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్‌ఎస్‌పి కాల్వలపై గట్టి నిఘాపెట్టి గుంటూరు రైతులు ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ఈ విషయంలో జిల్లాలోని అధికారపక్షానికి నేతలు సైతం దృష్టిసారించి అవసరమైతే కాల్వలపై పర్యటించాల్సిన అవసరం కూడా ఉందన్న భావన అన్నివర్గాల నుండి వినిపిస్తోంది. మొత్తంమీద జిల్లాకు నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయటంలో అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.