ప్రకాశం

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 25:జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం నుండే జిల్లాలోని అన్ని చర్చిలు క్రైస్తవులతో నిండిపోయాయి. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చిలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని జెఎంబి చర్చిలో భారీగా క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ సుజాతశర్మ జెఎంబి చర్చిలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవసోదరులనుద్దేశించి మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలను అందరూ తప్పక పాటించాలన్నారు. నిస్వార్థ, త్యాగగుణం, నిజాయితీ వంటి సుగుణాలను అందరు అలవర్చుకోవాలని కోరారు. ప్రభుత్వం క్రైస్తవులకోసం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని ఆ పథకాలను క్రైస్తవులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని క్రైస్తవులందరికి కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. ఈకార్యక్రమంలో జెఎంబి చర్చి సంఘ కాపరి, నిర్వాహకులు ఎ జాన్‌ప్రభాకర్, చర్చికమిటీ అధ్యక్షుడు పీటర్‌బాబు,కార్యదర్శి జయకుమారిలు జిల్లాకలెక్టర్‌కు బైబిల్‌ను బహుకరించారు. క్రిస్మస్ పండగ ప్రాచుత్యాన్ని గురించి పాస్టర్ జాన్‌ప్రభాకర్ ప్రార్థనలో పాల్గొన్న భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు గీతాలను పలువురు ఆలపించారు. అదేవిధంగా ఒంగోలు నగరంలోని పాతమార్కెట్ సెంటర్ వద్ద ఉన్న ఆర్‌పిఎం చర్చిలో పాస్టర్ రెవరెండ్ హృదయరాజ్, నెల్లూరు బిషప్ మోజేష్ ప్రకాశం తదితరులు పాల్గొని క్రిస్మస్‌వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్థానిక క్లౌపేట వద్ద ఉన్న ఐఇఆర్‌ఎఫ్ చర్చిలో ప్రభువు సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జోసఫ్ పాస్టర్, సామ్రాట్ తదితరులు పాల్గొని ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యిమందికి అన్నదానకార్యక్రమం నిర్వహించటంతోపాటు కుష్టురోగులకు దుస్తులను పంపిణీచేశారు. అదేవిధంగా కబాడీపాలెం, గద్దలగుంటలో తదితర ప్రాంతాల్లోని చర్చిలను కూడా క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వ్యక్తి దారుణ హత్య
యద్దనపూడి, డిసెంబర్ 25: మండల పరిధిలోని యనమదల గ్రామంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన ఆదివారం వెలుగుజూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జి సంగీతరావు(40) గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి నుంచి శనివారం రాత్రి 9 గంటల సమయంలో అతని అన్న కొడుకు ఏసుబాబుతో కలిసి బయటకువెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. తరువాత రోజైన ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీపంలోని వాగు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పటికే సదరు సంగీతరావు మరణించినట్లు వారు తెలుసుకున్నారు. గుంటూరులో బేల్దారి పనిచేస్తున్న మృతుని అన్న కొడుకు ఏసుబాబు పండుగ సందర్భంగా సొంతూరు వచ్చి బాబాయిని బస్టాండుకి బైక్ తీసుకుని రావాలని ఫోన్ చేశాడు. ఆ మేరకు సంగీతరావు తన బైకుపై బస్టాండుకు వెళ్లి కొడుకు వరసైన ఏసుబాబును అతని ఇంటి వద్ద వదిలిపెట్టి తన ఇంటికి వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత ఏసుబాబు తిరిగి సంగీతరావు ఇంటికి వచ్చి బయటకు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఒంగోలు నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ సంఘటనా స్థలంలో సోదాలు జరిపాయి. సంగీతరావు మృతదేహం వద్ద పరుపుతో పాటు స్వల్పంగా మృతదేహం కాలిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డిఎస్పీ ప్రేమ్‌కాజల్, ఎస్సై చెంచుప్రసాద్ వివరాలు సేకరించారు.