ప్రకాశం

మల్లవరం ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు వైకుంఠ ద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 7:మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టుదగ్గర మల్లవరం కొండపై శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు. పురాతనమైన వెంకటేశ్వరస్వామి ఆలయం కావటంతో భక్తులు మద్దిపాడు మండలంలోని అనేక గ్రామాలనుండే కాకుండా ఇతర ప్రాంతాలనుండి భారీగా విచ్చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామివారికి భక్తులు విశేషపూజలు చేయనున్నారు. వేకువజాము నుండే భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈపాటికే నిర్వాహకులు దేవాలయాన్ని విద్యుత్‌కాంతులతో అలంకరించారు. ఆదివారం సెలవుదినం కావటంతో పర్యాటకులు ఎక్కువసంఖ్యలో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రానున్నారు. దీంతో పర్యాటకులతో కూడా ఈ ఆలయం నిండనుంది. అద్దంకి ప్రొలయవేమారెడ్డి కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి మల్లవరం వెంకన్నస్వామి భక్తులకు వరాలు ఇస్తూ దర్శనమిస్తున్నారు.