ప్రకాశం

సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జనవరి 20:కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ప్రజ్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రజాసమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలం చెందాయని రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రాల్లో పరిపాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. నోట్లరద్దుతో ఎటిఎంల వద్ద 150మంది మృత్యువాతపడ్డారని, దీనికి కారణం దేశప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మోదీకి ఎన్ని శిక్షలు వేయాలో ప్రజలే తేల్చాలన్నారు. మోదీ బాణం పెద్దలకు తగాల్సిందిపోయి పేదలకు తగిలిందన్నారు. 7106కోట్లరూపాయల మొండిబకాయిలను పెద్దలకు మాఫీ చేశారన్నారు. ఆర్‌బిఐపై పూర్తిగా గౌరవం పోయిందని మాజీ గవర్నర్లే ఆవేదన వ్యక్తం చేశారన్నారు. బ్రిటిష్ పరిపాలనను తలపించేవిధంగా ప్రస్తుత పరిపాలనలు ఉన్నాయని, ఆనాడు బ్రిటిష్ పరిపాలనను తట్టుకోలేక తరిమికొట్టినవిధంగా కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి, టిడిపి ప్రభుత్వాలను తరిమితరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వర్షాభావంవలన రాష్ట్రంలో తీవ్రంగా కరవు ఏర్పడిందని రైతులు, డ్వాక్రామహిళలు రుణాల మాఫీకాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి పరిపాలనను గాలికి ఒదిలేసి విదేశాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. పట్ట్భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డిని నిలబెట్టడటం జరిగిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో భారీమెజార్టీతో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసందర్బంగా పిసిసి ప్రధానకార్యదర్శులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్‌హాయంలోనే రాష్టవ్య్రాప్తంగా ప్రాజెక్టులు ఏర్పాడ్డాయని, ఆప్రాజెక్టులను తానే ఏర్పాటుచేసినట్లు ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టుకోవటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందన్నారు.ఎంఎల్‌సి అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థి ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రెండులక్షల 29వేలమంది పట్ట్భద్రుల ఓటర్లు ఉన్నారని, నిరుద్యోగసమస్యపై శాసనమండలిలో వాణి వినిపించాలంటే తనను మంచిమెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.ముఖ్యమంత్రి ఎన్‌చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకాలేదన్నారు. నిరుద్యోగభృతి ఇవ్వలేదని, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా వస్తుందన్నారు. విలేఖర్ల సమావేశంలో నగర పార్టీఅధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం,నాయకులు ఈదా సుధాకర్‌రెడ్డి, డాక్టర్ రాజ్‌విమల్, చంద్రశేఖర్‌యాదవ్, వై శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.