ప్రకాశం

రేపు జిల్లాలో కేంద్ర కరవు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 22:కేంద్ర కరవు బృందం ఈనెల 24న జిల్లాలో పర్యటించనుంది. ఆ మేరకు పర్యటన ఖరారైంది.కేంద్రకరువుబృందానికి టీం లీడరుగా జి రాంబాబు, మెంబర్లుగా ఎసి మీనా, హెచ్‌ఆర్ ఖన్నాలు ఉన్నారు.టీం లీడరు సారధ్యంలో జిల్లాలో కరవుబృందం పర్యటించి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖతోపాటు ఇతర రైతులతో ముఖాముఖి కానుంది.కేంద్ర కరవు బృందం ఈనెల 24వతేదీ ఉదయం పదిగంటలకు నెల్లూరులో బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిథిగృహానికి చేరుకుంటారు. 12.20గంటల వరకు ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో అల్పాహార విందు చేసిన తరువాత మధ్యాహ్నం 1.30గంటల వరకు స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై జిల్లా యంత్రాంగం బృందానికి వివరించనుంది. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం కానుంది. మధ్యాహ్నం 1.30గంటల నుండి రెండుగంటలవరకు ఎన్‌ఎస్‌పి అతిథి గృహంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం రెండుగంటలనుండి 4.10గంటలకు బేస్తవారిపేటకు చేరుకోనున్నారు. 4.10గంటల నుండి 4.20గంటల వరకు టీ బ్రేక్ తీసుకోనున్నారు. 4.20గంటల నుండి 4.40గంటల వరకు బేస్తవారిపేట మంటలంట పుసలపాడులోని పొలాలను పరిశీలించి అనంతరం కందిరైతులతో ముఖాముఖి కానున్నారు. 4.55గంటలనుండి 5.10గంటల వరకు కంభంలోని చినకంభంలోని బత్తాయితోటలను పరిశీలించనున్నారు. అదేవిధంగా బత్తాయి తోటల రైతులకు బృందం ముఖాముఖికానుంది. సాయంత్రం 5.10గంటలనుండి 5.40గంటల వరకు కంభం మండలంలోని జంగమకుంట్లలోని డెయిరీ రైతులతో ముఖాముఖికానున్నారు. అనంతరం ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన కంది ఇతర పంటలను పరిశీలించనున్నారు. 5.40గంటలనుండి 5.55గంటలకు మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెంలో ఎండిపోయిన బత్తాయితోటలను పరిశీలించనున్నారు. 5.55గంటలనుండి 6.20గంటల మార్కాపురం మండలంలోని నికరంపల్లిలో పత్తిరైతులతో ముఖాముఖి కానున్నారు. 6.35గంటలనుండి 6.50గంటల వరకు పెద్దారవీడు మండలం తోకపల్లిలో కందిరైతులతో ముఖాముఖికానున్నారు. 6.50గంటలనుండి 7.10గంటల వరకు పెద్దారవీడు మండలంలోని కుంట వద్ద కంది రైతులతో ముఖాముఖి అయిన తరువాత 9.20గంటలకు ఒంగోలులోని ఎన్‌ఎస్‌పి అతిథిగృహానికి చేరుకుంటారు. ఈనెల 25వతేదీన ఒంగోలునుండి విజయవాడకు బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో మాట్లాడనున్నారు.
ఇదిలా ఉండగా ఖరీప్‌సీజన్‌లో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖలకు సంబంధించిన రైతులకు కోట్లరూపాయల్లో నష్టం వాటిల్లింది. ప్రతిసంవత్సరం లాగానే గతసంవత్సరం కూడా జిల్లాలో కరవు పరిస్థితులు వెంటాడాయి. దీంతో రైతులు సాగుచేసిన కందిపంట వాడిపోయి దిగుబడులు పూర్తిస్థాయిలో తగ్గాయి. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా వరిసాగును రైతులు తగ్గించారు. కరవుపరిస్థితుల నేపధ్యంలో పత్తిపంట దిగుబడులు కూడా భారీగా తగ్గాయి. కంది పంట ఎకరానికి దిగుబడులు వస్తే నాలుగు క్వింటాల వరకు వస్తుంది. కాని కరవుపరిస్థితుల నేపధ్యంలో కందిచేను గిటకబారిపోయి నేడు క్వింటాకూడా వచ్చే పరిస్థితులు లేవు. దీంతో జిల్లాలోని కంది రైతన్నలు ఆర్థికంగా చితికిపోయారు. అదేవిధంగా పత్తిపంట రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పశ్చిమప్రాంతంలోని రైతులు బత్తాయి తోటలను సాగుచేసుకుని జీవనం సాగిస్తారు. కాని గత సంవత్సరం ప్రచండభానుడు తన ప్రతాపాన్ని చూపటంతో బత్తాయితోటలు నిలువునా ఎండిపోవటం జరిగింది. దీంతో కొంతమంది రైతులు బత్తాయితోటలను నిలువునా నరికివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లాలో 56మండలాలు ఉండగా వాటిలో 46మండలాలను కరవుమండలాలుగా ఈపాటికే రాష్ట్రప్రభుత్వ ప్రకటించింది. జిల్లా మొత్తాన్ని కరవుజిల్లాగా ప్రకటించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం కూడా జిల్లామొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
జిల్లాలో కరవు పరిస్థితులు ఏర్పడటంతో భూగర్బజలాలు అడుగంటిపోయాయి. వందలఒ అడుగుల లోతులో బోర్లు వేసిన పశ్చిమప్రాంతంలో నీరురాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాగు,సాగునీటికి పశ్చిమప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.్భగర్భజలాలు పడిపోవటంతోనే బత్తాయితోటలు వేసవికాలంలో నిలువునా ఎండిపోతున్నాయి. కోస్తాతీరప్రాంతంలోను భూగర్బజలాలు అడుగంటిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కరవుపరిస్థితులు నెలకొన్న ప్రతిసారి కేంద్రప్రభుత్వం జిల్లాకు రావటం పరిపాటిగా మారుతుందే కాని, రైతులకు మాత్రం ఆశించిన స్థాయిలో కేంద్రప్రభుత్వం నుండి నష్టపరిహారం అందటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమిటీ అయిన జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అధికనిధులు వచ్చేవిధంగా తోడ్పాటు అందించాలని అన్నివర్గాల వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.