ప్రకాశం

‘జగన్‌పై దామచర్ల, కదిరి విమర్శలు అర్ధరహితం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 22: వైకాపా రాష్ట్ర అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 20న నిర్వహించిన జిల్లా పర్యటన రాజకీయ లబ్ధి కోసమేనని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంగోలు ఎంఎల్‌ఎ దామచర్ల జనార్దన్, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కదిరి బాబూరావు విమర్శించడం విడ్డూరంగా ఉందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి స్వయం గా పిసిపల్లిలో పర్యటన నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు వస్తే, రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించడం బాధాకరమని అన్నారు. పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి జగన్ పర్యటనను వక్రీకరించి వారు మాట్లాడుతున్నారని అన్నారు. వైకాపాకు చెందిన వ్యక్తులను మూత్రపిండ వ్యాధిగ్రస్తులుగా చూపి నాటకాలు ఆడారని విమర్శించడం వారి స్థాయికి తగినది కాదని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 422 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారికి సరైన వైద్యం అందక మృతి చెందారని మరో 2,126 మందికి కిడ్నీ వ్యాధి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, వారికి సరైన వైద్యం అందటం లేదని, దీంతో వారిని స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి ప్రభుత్వం దృష్టికి వారి సాధక బాధలను తెలియజేసేందుకు పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో తమ నియోజక వర్గంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కోరినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు చెబుతున్నారని, ఇందుకోసం మరో ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు కూడా అబద్ధపు ప్రకటనలు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితుల కోసం ఏమి చేశారని దేశం పార్టీలు విమర్శిస్తున్నారని అప్పటి ముఖ్యమంత్రి దివంగతి వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయల నిధులను కేటాయించి వారిని ఆరోగ్యపరంగా ఆదుకున్న విషయాలు వారికి గుర్తుకు రావడం లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా కిడ్నీ బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో వైకాపా ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో కార్పొరేషన్ కమీషనర్ ఎవరూ ఫ్లెక్సీలు పెట్టుకోవద్దని ప్రకటించారని, అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒం గోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు జన్మదిన వేడుకల సందర్భంగా నగరమంతా ఫ్లెక్సీలను పెట్టుకొనేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తమకు ఒక న్యాయం, అధికార పార్టీ వారికి ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు. విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చుండూరి రవి, ఒబుల్‌రెడ్డి, కెవి రమణారెడ్డి, అశోక్‌రెడ్డి, అంజిరెడ్డి, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.