ప్రకాశం

ఖరీఫ్ పంట నష్టం అంచనా రబీలోనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 23: ఖరీప్‌లో సీజన్‌లో జరిగిన రైతుల పంటల నష్టాలను అంచనాలు వేసేందుకు కేంద్రబృందం రబీసీజన్‌లో రావడం దురదృష్టకరమని వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక జిల్లా వైకాపా కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఖరీప్ సీజన్ అయిపోయి ప్రస్తుతం రబీ సీజన్ కూడా వచ్చిందని ఇలాంటి సమయంలో కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించి రైతులకు జరిగిన పంటల నష్టాలను ఎలా గుర్తించి నష్టాలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఎలా ఇస్తారో తనకు అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. జిల్లాలోని పశ్చిమప్రాంతంలోని రైతులు వివిధ రకాలు పంటలను ఖరీప్ సీజన్‌లో వేసి తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. నష్టపోయిన రైతులకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడినట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా 2016 ఆగస్టులో పశ్చిమప్రాంతంలోని రైతులు బొబ్బర్లు, మినుము, పెసర , కంది పంటలను తిరిగి సాగుచేశారని వర్షాలు లేక వారు వేసిన పంటలు ను రైతులు నష్టపోవాల్సివస్తుందన్నారు. పశ్చిమప్రాంతంలోని రైతులకు పంటల మీద ఆధారం లేక పాడిగేదెలను మేపుకోని జీవనం సాగిస్తుంటే ప్రస్తుతం ఆ గేదెలకు కూడా మేత దొరక పోవడంతో ఒక్కో ట్రాక్టర్ ట్రక్కు వరి గడ్డి 10వేల రూపాయల లెక్కన కొనుగోలు చేసి పాడిపశులను మేపుకోలేక తక్కువ ధరలకు పాడిగేదెలను తెగనమ్మి పక్క జిల్లాలకు వారు కూలి పనులకు వెళ్ళాల్సివస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల పంటలకు జరిగిన నష్టపరిహారాన్ని వెంటనే ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంఎల్‌సి ఎన్నికల్లో వేమిరెడ్డిని
అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
టిడిపి జిల్లా సమన్వయకమిటీ సమావేశం తీర్మానం

ఒంగోలు,జనవరి 23:రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించటంతోపాటు, జిల్లాలో పార్టీని సంస్థాగతపరంగా మరింత అభివృద్ధి చేద్దామని, ఒంగోలులో నూతన పార్టీకార్యాలయాన్ని నిర్మిద్దామంటూ జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం తీర్మానించింది. జిల్లా సమన్వయకమిటీ సమావేశం సోమవారం రాత్రి స్థానిక జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో జిల్లాపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో అభ్యర్థిని అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చే విధంగా గెలిపించాలని సమన్వయకమిటి తీర్మానించింది. కాగా జిల్లాలోని తాగునీరు, సాగునీటి అవసరాల కోసం విడుదలైన సాగర్ జలాలు సక్రమంగా పంపిణీపై విడుదల కావాల్సిన మూడు టిఎంసిల నీటిపై ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈనెల 20వతేదీన వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనిగిరి నియోజకవర్గ పర్యటనలోభాగంగా, ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఒంగోలునగరంలోని సౌత్‌బైపాస్‌రోడ్డు కూడలిలో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్‌కు చెందిన 66/1సి, 67/1ఎలోని 1.60సెంట్ల స్ధలంలో జిల్లా తెలుగుదేశంపార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించేవిషయంపై నేతలు చర్చించారు. పశ్చిమప్రాంత వరప్రసాదిని అయిన వెలుగొండప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మించాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మార్టూరు, గిద్దలూరు, పొదిలి, యర్రగొండపాలెం, చీరాల మార్కెట్ కమిటిలను త్వరగా ఏర్పాటుచేయాలని సమావేశం తీర్మానించింది. గిద్దలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువుగా ఉన్నందున, దూపాడు రిజర్వాయరునుండి మంచినీటిని తరలించేవిధంగా చర్యలు చేపట్టాలని నేతలు చర్చించారు. జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, కందుకూరుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం మూడు డయాలసిస్ సెంటర్లను మంజూరు చేసినందుకు రాష్ట్రప్రభుత్వానికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమన్వయకమిటి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జీ మంత్రి రావెల కిశోర్‌బాబు, రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దారాఘవరావు, శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, కదిరి బాబురావుతోపాటు ఆయానియోజకవర్గాల ఇన్‌చార్జులు కరణం వెంకటేష్, దివి శివరాం, పోతుల సునీత, కందుల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మామూళ్లు ఇవ్వలేం..!
* లబోదిబోమంటున్న రేషన్‌షాపు డీలర్లు
* నెలకు ఒక్కొ షాపు నుంచి 1050 రూపాయలు అధికారులకు చెల్లించాల్సిందే
* సంవత్సరానికి మరోశాఖకు రెండువేల నజరానా * నెలకు లక్షల్లో అధికారులకు అక్రమవసూళ్లు

ఒంగోలు, జనవరి 22:రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాలను అన్నివిధాల ఆదుకునేందుకు రూపాయికే కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా, ఆ బియ్యాన్ని పంపిణీ చేసే రేషన్‌షాపుల డీలర్లు మాత్రం అధికారులకు నెలవారినుండి, సంవత్సరం మాముళ్లు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. మామూళ్ల విషయంలో అధికారపార్టీకి చెందిన రేషన్‌షాపుడీలరు అయినా అధికారులకు మాత్రం మామూళ్లు చెల్లించాల్సిందే. లేనిపక్షంలో సవాలక్షా కొర్రిలు వేసి వారిపై ప్రత్యేకంగా దాడులు చేయటం జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,131 రేషన్‌షాపులు ఉన్నాయి. ఆ రేషన్ షాపుల పరిధిలో సుమారు తొమ్మిదిలక్షల తెల్లరేషన్‌కార్డులకు 11మెట్రిక్‌టన్నుల వరకు రూపాయికే బియ్యాన్ని డీలర్లు పంపిణీచేస్తారు. బియ్యంతోపాటు,పంచదార, కిరోసిన్‌ను డీలర్లు సరఫరా చేయటం జరుగుతుంది. గ్రామాల్లో రేషన్‌షాపు డీలరు రాజకీయంగా కీరోల్ పోషిస్తుంటారు. ఇటీవల తెలుగుదేశంప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కొంతమంది తెలుగుదేశంపార్టీకార్యకర్తలకు రేషన్‌షాపులు వచ్చాయి. రేషన్‌షాపుతో తమ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల అవుతుందని వారు భావించారు. కానీ నెలకు ఐదువేల రూపాయలు కూడా రావటం లేదని తాము ఎందుకు ఈషాపులను తీసుకున్నామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఒక్కొక్క రేషన్‌డీలరు నెలకు మండలస్థాయిలోని అధికారులకు 1050రూపాయలు మామూళ్లరూపంలో చెల్లించాల్సిఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. మండల స్థాయిలో చెల్లించే మాముళ్లకన్నా, జిల్లాస్థాయి అధికారులుకూడా తరుచుగా దాడులు చేయటం వలన వారికి కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక డీలర్ ఆంధ్రభూమి ప్రతినిధి ఎదుట వాపోయారు. అదేవిధంగా జిల్లాకు చెందిన కీలకమైన ఒక శాఖకు చెందిన అధికారులకు సంవత్సరానికి రెండువేల రూపాయలు చెల్లించాల్సిఉంటుంది. అధికారులు దాడులు ఒక ఎత్తు అయితే రాజకీయనాయకులకు అవసరమైన సమయంలో కొంతనగదును ముట్టచెప్పాల్సిఉంటుంది. ఇలాంటి పరిస్ధితుల్లో తాము రేషన్‌షాపులు నడపటం న్యాయమా అంటూ కొంతమంది రేషన్‌డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది. ఈ విధానంతో ఎలాంటి అక్రమాలు జరగవని ఇలాంటి సమయంలో అధికారులకు ఏవిధంగా మాముళ్ళు ఇచ్చుకోవాలని కొంతమంది డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కొంతమంది తెల్లరేషన్‌కార్డుదారులు బయట మార్కెట్‌లో ఒక కిలో బియ్యాన్ని పదిరూపాయలకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మండల, జిల్లా స్ధాయిలో జరిగే ఈ కార్యక్రమానికైనా రేషన్‌షాపుల డీలర్ల పాత్ర ఎంతకంతో ఉండాల్సిఉంటుందనేది జగమెరిగిన సత్యమే. ఇప్పటికైనా రేషన్‌షాపుల డీలర్లనుండి మామూళ్ళను తగ్గిస్తే మెరుగ్గా రేషన్‌ను తెల్లరేషన్‌కార్డుదారులకు అందే అవకాశాలున్నాయి. మొత్తంమీద రేషన్‌షాపుల డీలర్లను మామూళ్ల రూపంలో అధికారులు పీల్చిపిప్పిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నేడు కరవు బృందం పర్యటనకు
ఏర్పాట్లు పూర్తి చేయాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్

ఒంగోలు, జనవరి 23 : జిల్లాలో మంగళవారం కేంద్ర కరవు బృందం పర్యటిస్తుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు సంసిద్దం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి రెవిన్యూ డివిజన్ అధికారులు, పొదిలి, కొనకనమిట్ల, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట మండల తహశీల్థార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు, ఇరిగేషన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కేంద్ర కరవు బృందం పర్యటనపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కేంద్ర కరవు బృందం పర్యటించే ప్రాంతాల్లో ఆయా మండలాల్లో కరవుకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర కరవు బృందానికి వివరాలను స్పష్టం తెలియజేయాలని సూచించారు. కేంద్ర కరవు బృందం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ శాతం రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతంలో పంట నష్టాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు ఉన్నారు.
నగదు రహిత లావాదేవీలపై
పోలీసు అధికారులకు వర్క్‌షాప్ ప్రారంభం
ఒంగోలు,జనవరి 23: నగదు రహిత లావాదేవీలపై అవగాహన కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి త్రివిక్రమవర్మ సోమవారం వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జడ్‌పి సిఇఓ టి బాపిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నరశింహారావు, సీనియర్ కౌన్సిల్ జ్ఞాన జ్యోతి సంస్థ ప్రస్నేశ్వరబాబు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మేనేజర్ కె జగదీష్ పాల్గొని జిల్లాలోని పోలీసు అధికారులందరికీ నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. దీనివల్ల దొంగనోట్ల చెలామణి తగించవచ్చని, ఆన్‌లైన్ విధానం వలన అన్ని కార్యక్రమాలు రికార్డుగా ఉంటాయని, మోసాలకు అవకాశం తక్కువుగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి అడ్మిన్ ఎ దేవదానం, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్త్భివంతో మానసిక ప్రశాంతత
- గణపతి సచ్చిదానంద స్వామి ఉద్బోధ
చీరాల, జనవరి 23: ప్రజలు భక్త్భివం పెంపొందించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. వైకుంఠపురంలోని శ్రీ శివదత్త క్షేత్రంలో సోమవారం సరస్వతి హోమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్వామికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులనుద్దేశించి స్వామి ప్రసంగిస్తూ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుడు సృష్టించిన జగతిలో ఏదీ శాశ్వతం కాదన్నారు. స్వామీజీ చేతుల మీదుగా పూర్ణాహుతి, శ్రీచక్రార్చన, మహాగణపతి, అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి, శ్రీజ్ఞాన సరస్వతి దేవతామూర్తులకు అభిషేకాల అనంతరం అన్న ప్రసాద వినియోగం గావించారు. ఈ కార్యక్రమంలో శివదత్తక్షేత్రం ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.