ప్రకాశం

ప్రక్షాళన దిశగా వైకాపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 4:జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. జిల్లాలోని అన్నిగ్రామాల్లో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఆ క్యాడర్‌ను నడిపించే సత్తా కలిగిన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రాష్టప్రార్టీ ప్రక్షాళన చేపట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మరో రెండు,మూడు నెలల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా పార్టీపరంగా సమూలంగా మార్పులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తొంది. రానున్న ఎన్నికలు జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కానుండటంతో ప్రతి నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది. ఈ నేపధ్యంలో ఆ సర్వే ఆధారంగా కూడా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. తొలివిడతగా జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంపై జగన్ ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈనేపధ్యంలో ముందుగా కందుకూరు నియోజకవర్గంలోని ఒక అతిథిగృహంలో రాత్రికి జగన్ బసచేసి ఆ తరువాత కనిగిరి నియోజకవర్గకేంద్రమైన పిసిపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కిడ్నీవ్యాధిగ్రస్తులతో ముఖాముఖిగా జగన్ మాట్లాడారు. కాగా జగన్ బసచేసిన సమయంలోను, ఆ తరువాత రోజున కందుకూరు నియోజకవర్గంలో వైకాపా శ్రేణులను, యువతీ, యువకులను భారీగా సేకరించటంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి తూమాటి మాధవరావు విఫలమయ్యారన్న చర్చ సాగుతుంది. అతిథి గృహం వద్దకాని, కనిగిరికి వెళ్ళే సమయంలో భారీగా జనాన్ని సమకూర్చటంలో తూమాటి విఫలం అయ్యారన్న చర్చ పార్టీలో విస్తత్రంగా నడుస్తుంది. గతంలో జరిగిన ఓదార్పుయాత్ర సందర్బంగా కందుకూరు నియోజకవర్గంలో జగన్‌కు ప్రజలు బ్రహ్మారధం పట్టారు. అలాంటి శ్రేణులను ఈసారి లేకపోవటంతో జగన్ పూర్తిస్ధాయిలో అసహానానికి గురైనట్లు సమాచారం.
ఇదిఇలాఉండగా మాజీమంత్రి, కందుకూరు నియోజకవర్గ ముఖ్యనాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డిని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తొంది. గతంలోనే మానుగుంట చేరాల్సి ఉండగా అనివార్యకారణాల వలన వాయిదా పడింది. ప్రస్తుతం మానుగుంటను పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్టప్రార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో కందుకూరు మునిసిపాలిటికి ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయగల సత్త మానుగుంటకు ఉందన్న విషయాన్ని రాష్టప్రార్టీ గుర్తించిన నేపధ్యంలో ఆయన్ను పార్టీలోకి సాదారంగా ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తూమాటికి కూడా పార్టీపరంగా సముచిత స్థానం ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తొంది. జిల్లాలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటమేకాకుండా జిల్లాలోని 12నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలతో మానుగుంటకు సంబంధాలున్నాయి. ఈ నేపధ్యంలో మానుగుంటను పార్టీలోకి చేర్చుకుంటే ఒక్క కందుకూరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లోను ఆయన ప్రాభాల్యం ఉండే అవకాశాలున్నాయి. అన్ని కోణాలను చూసి మానుగుంటను త్వరలో పార్టీకి జగన్ ఆహ్వానించే అవకాశాలున్నట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జులను తొలగించి వారి స్థానంలో సమర్ధులైన నాయకులకు పట్టంకట్టే అవకాశాలులేకపోలేదన్న వాదన ఆపార్టీ నాయకుల నుండి వినిపిస్తొంది. మొత్తంమీద తొలుత కందుకూరు నియోజకవర్గం నుండే జిల్లాలో పార్టీని ప్రక్షాళన చేసేందుకు జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం.