ప్రకాశం

మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని అంతిమయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, ఫిబ్రవరి 13: వేలాది మంది అభిమానులు, కార్యకర్తల నడుమ రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడి అంతిమ యాత్ర సోమవారం స్వగ్రామం మోపాడులో నిర్వహించారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి అశేష జనవాహిని పెద్దాయనగా పిలువబడే ఇరిగినేని తిరుపతినాయుడి పార్థీవ దేహాన్ని కడసారిగా చూసేందుకు బారులు తీరారు. మండలం నుంచే కాకుండా జిల్లాలోని నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలు తిరుపతినాయుడు అమర్ రహే అంటూ నినదిస్తూ అశ్రు నయనాలతో ఆయనకు నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కరణం బలరాం, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే యు శ్రీనివాసులరెడ్డి, కెపి కొండారెడ్డి, రాఘవరావు, ఎఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, జడ్‌పి చైర్మన్ ఈదర హరిబాబు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కె ఆదెన్న, జిల్లా జడ్‌పిటిసిల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ పారిశ్రామికవేత్త కె జనార్దన్, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ తదితరులు తిరుపతినాయుడి పార్థీవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఆయన కుమారులైన ఇరిగినేని రవి, రాజా, బాలతోపాటు ఇరిగినేని తిరుపతినాయుడు సతీమణి లక్ష్మమ్మకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన ఇరిగినేని
అనంతరం పోతుల రామారావు, కరణం బలరాం, ఉడుముల శ్రీనివాసులు, కొండారెడ్డి, రాఘవరావు తదితరులు మాట్లాడుతూ తమకు సహచర ఎమ్మెల్యేగా ఎన్నో మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఇరిగినేని అని కొనియాడారు. ధనార్జనను పక్కనబెట్టి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. చనిపోయేంత వరకు నిరాండంబర జీవితం గడిపిన ఇరిగినేని తిరుపతినాయుడు ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల నడుమ మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు పార్థీవ దేహాన్ని స్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోనే ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయినట్లు వివిధ పార్టీల నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇరిగినేని అంతిమ యాత్రలో జిల్లా తెలుగుదేశం యువజన నాయకులు ఎం శ్రీ్ధర్, జి వెంకటేశ్వర్లు, ఎంపిపి ఆవుల నాగేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా అధ్యక్షులు ఈదర మోహన్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.