ప్రకాశం

జిల్లాలో గొంతెండుతున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 14: జిల్లాలోని పశ్చిమప్రకాశంతో పాటు, తూర్పుప్రకాశం ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. గతంలో పశ్చిమప్రకాశంలోనే ఎక్కువుగా నీటి సమస్య ఉండేది,కాని రాను,రాను తూర్పుప్రకాశంలోను మంచినీటి సమస్య జఠిలంగా ఉండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం జిల్లావ్యాప్తంగా మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చటం తీరా వేసవికాలం పూర్తిఅయిన తరువాత ఆ ఊసే ఎత్తకుండాపోవటం అధికారులకు, ప్రజాప్రతినిధులకు అలవాటుగామారిపోయిందే తప్ప తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాత్రం ఏలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమప్రాంత వరప్రసాదిని అయిన పూలసుబ్బయ్య వెలుగొండప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయితే ఆప్రాంత ప్రజలకు దాహార్తి తీరుతుంది. అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయరును పూర్తిస్ధాయిలో నిర్మిస్తే తూర్పుప్రకాశంలోని పలుగ్రామాల్లోను మంచినీటి ఎద్దడికి చెక్‌పెట్టినట్లు అవుతుంది. కాని వెలుగొండప్రాజెక్టు నిర్మాణానికి మాత్రం నిధులను తక్కువుగా కేటాయిస్తుండటతో పనులు నత్తనడనక సాగుతున్నాయి. వెలుగొండప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయి ఒక్కసారి ప్రాజెక్టుమొత్తం నీటితో నిండితే ఆనీరు నాలుగుసంవత్సరాలకు సరిపడా సాగు,తాగునీటికి వస్తాయని ఒక చీఫ్ ఇంజనీరు ఆంధ్రభూమిప్రతినిధికి తెలిపారు. కాని అలాంటి చర్యలు పూర్తిస్థాయిలో జరగటం లేదు.
ఇదిలాఉండగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా పిడబ్ల్యుఎస్ స్కీమ్స్ 912 ఉండగా వాటిలో 112 ఎండిపోయాయి. యంపిడబ్ల్యుఎస్‌స్కీమ్స్ 923 ఉండగా వాటిలో 329 ఎండిపోగా, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ 812 ఉండగా వాటిలో 536 ఎండిపోయాయి. చేతిపంపులు 26వేల 535 ఉండగా వాటిలో 6,286, 107మంచినీటి బావులు నీరు లేక ఎండిపోయినట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గుర్తించారు. అధికారుల లెక్కల ప్రకారమే ఇన్ని స్కీమ్స్ ఎండిపోతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఎండిపోయి ఉంటాయో ఆ దేవుడికే తెలియాల్సిఉంది. కాగా జిల్లాలోని పశ్చిమప్రాంతంలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఐదువందలనుండి ఏడువందల అడుగుల లోతులో బోర్లు వేసిన నీరు రాక దుమ్ము పడుతుంది. దీంతో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు బోర్ల కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టుకున్న నీరు రాని పరిస్ధితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పశ్చిమప్రాంతంలో బోర్లు వేసిన దుమ్ము వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లాలోని పశ్చిమప్రాంతానికి చెందిన ప్రజలు ఫ్లొరైడ్‌నీటినే తాగుతూ కిడ్నీవ్యాధిబారిన పడుతున్నారు. జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశం సైతం జిల్లామొత్తం వాటర్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గతంలో తూర్పుప్రకాశంలో నీటి కొరత కొంత తక్కువుగానే ఉండేది. కాని ప్రస్తుత పరిస్ధితిలో తూర్పుప్రకాశంలోను మంచినీటి కొరత ఏర్పడిందనే చెప్పవచ్చు.
జిల్లావ్యాప్తంగా బబుల్స్ ద్వారా మంచినీటి వ్యాపారం మూడుపువ్వులవు ఆరుకాయాలుగా విరాజిల్లుతుంది. అరలీటరు రెండురూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇళ్ళకు మాత్రం బబుల్స్‌ను 20రూపాయలకు వ్యాపారస్తులు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అదేవిధంగా డిమాండ్‌ను బట్టి 25నుండి 30రూపాయల వరకు వ్యాపారస్తులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి నెలలోనే నీళ్ళవ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటే మే, జూన్, జూలై నెలలో ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ అన్నివర్గాలనుండి వినిపిస్తొంది. మంచినీటి వ్యాపారస్తులపై అధికారులు కొరఢాజులిపిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు.
కాగా జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఎక్కువుగాబత్తాయి, బొప్పాయి, నిమ్మ తోటలను రైతులు సాగుచేస్తున్నారు.ప్రస్తుతం సాగునీరు లేక ఉద్యానవనపంటలు సైతం వాడుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యానవన తోటలు ఎండిపోయే పరిస్ధితి కూడా ఏర్పడనుంది. మొత్తంమీద జిల్లాలోని అన్నివర్గాలప్రజలు మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.