ప్రకాశం

ప్రత్యేక హోదాకు ఎంఎల్‌సి ఎన్నికలు రెఫరెండమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 17: ప్రభుత్వానికి ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సి ఎన్నికలు ప్రత్యేక హోదాకు రెఫరెండమేనని కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌సి అభ్యర్థి ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై ప్రజలు ఆలోచించడం లేదని, ఒకవేళ ప్రతిపక్షాలు గెలిస్తే ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆశలు ఉన్నాయని అర్థం అవుతోందని, ప్రభుత్వం ఈ విషయంపై రెఫరెండానికి వస్తే తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా యువత, విద్యావంతులు ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు, నరేంద్రమోదీ తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ఎపి ప్రజలను మోసం చేశారని అన్నారు. అయితే చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసే పరిస్థితి లేదని, ఒకవేళ ఒత్తిడి చేస్తే నోటుకు ఓటు కేసు ఎక్కడ వ్యతిరేకంగా చేస్తారోనని భీతిల్లుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు వేడుకుంటుంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంఎల్‌సి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటుచేసి వెలుగొండపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా ఉండవని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు అనేకమంది ముందుకు వస్తారని, హోదాతో రాయితీలు వస్తాయని అన్నారు. దొనకొండను పరిశ్రమల కారిడార్‌గా మారిస్తే ఈప్రాంతంలో వెనుకబాటుతనం పోవడమేకాక అభివృద్ధి చెంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా అక్కడ పరిశ్రమల ఏర్పాటు మాత్రం కాగితాలకే పరిమితం అవుతోందన్నారు.