ప్రకాశం

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలో శాసనమండలి ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శాసనమండలి ఉపాధ్యాయ , పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికల నిర్వహణపై ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్తగా శాసన మండలి ఓటర్లుగా నమోదు కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను రెండోస్థాయిలో తహశీల్దార్లు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌పిలను ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మాట్లాడుతూ జిల్లాలో పట్ట్భ ద్రుల నియోజకవర్గ ఎన్నికలకు 102 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. శాసనమండలి ఉపాధ్యాయ , పట్ట్భద్రుల నియోజక వర్గ ఎన్నికలకు ఐదు వందల పోలింగ్ బాక్సులు అవసరమని, అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 160 పోలింగ్ కేంద్రాలకు మరో పది ల్యాబ్‌ట్యాప్ అదనంగా అవసరం అవుతాయని ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల నుండి ల్యాబ్‌ట్యాప్‌లను గుంటూరు కలెక్టర్‌తో మాట్లాడి తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.