ప్రకాశం

ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 20: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, వాసుదేవనాయుడును భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు, రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, రాష్టప్రురపాలక శాఖమంత్రి పి నారాయణ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక గోపాలస్వామి ఫంక్షన్ హాలులో జిల్లా తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఎంఎల్‌సి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ సభ జరిగింది. ఈ సభకు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రులు రావెల, శిద్దా, నారాయణ మాట్లాడుతూ రానున్న ఎంఎల్‌సి ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త నుండి జిల్లాస్థాయి నేత వరకు ఎన్నికలపై దృష్టిసారించాలని వారు పిలుపునిచ్చారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా గ్రాడ్యూయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లను తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అధికంగా చేర్పించారని ఆ ఓటర్లను కలిసి ఓట్లు అడగాలని వారు కోరారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ఓట్లు ఉండేవని,కాని ఈసారి ప్రైవేటు కాలేజిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం ఓటుహక్కు ఉందని అందువలన ఎక్కువశాతం ఓట్లు తమపార్టీకి చెందిన అభ్యర్థులకే పడనున్నాయని, దీంతో అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులు యండపల్లి శ్రీనివాసరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం తక్కువ మెజార్టీతోనే గెలుపొందారని వారు తెలిపారు. ఆ సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదని కాని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల అభివృద్దికి రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎంతో కృషిచేశారని వారు తెలిపారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు ఫిట్‌మెంట్‌తోపాటు, వివిధ సదుపాయాలను కల్పించటం జరిగిందని వారు వివరించారు. ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని వారు పేర్కొన్నారు. నదుల అనుసంధానం చేసి ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అదేవిధంగా పట్టిసీమను పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని ముఖ్యమంత్రి చేశారని వారు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని అందువలన పార్టీఅభ్యర్ధులను గెలిపించాలని వారు కోరారు. ప్రతి నియోజకవర్గంలో తాము పర్యటిస్తామని వారు నాయకులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఒక రోజు ఎంఎల్‌సి ఎన్నికలపై నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని అదేవిధంగా 12రోజుల్లో 12రోజులు పర్యటిస్తామని వారు తెలిపారు. జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను ప్రతినాయకుడు ఛాలెంజ్‌గా తీసుకుని అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడు జిల్లాల్లో జరిగే ఎంఎల్‌సి ఎన్నికలు ప్రతిగ్రామానికి అభ్యర్ధి రాలేదని అనుకోకుండా మన బాధ్యతగా అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఇకనుండి ఎంఎల్‌సి ఎన్నికలపై ఏలాంటి విషయం కావాలన్న జిల్లా తెలుగుదేశం పార్టీకార్యాలయంలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంఎల్‌సి ఎన్నికల పరిశీలకులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంపార్టీ పిలుపులో భాగంగా సభ్యత్వాలను ఏవిధంగా చేర్చారో అదేవిధంగా ఓటర్లను పోలింగ్‌బూత్‌లకు తీసుకురావాల్సిన బాధ్యత పార్టీశ్రేణులపై ఉందన్నారు. సమష్టికృషితో ఎన్నికల్లో గెలిచి రాష్టమ్రుఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు, అద్దంకి, యర్రగొండపాలెం,కొండెపి,పర్చూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తిడేవిడ్‌రాజు,డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావుతోపాటు, కందుకూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల ఇన్‌చార్జులు దివి శివరాం, కరణం వెంకటేష్, పోతుల సునీత,పిడిసిసి బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు, రాష్టప్రార్టీ కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, జిల్లాపార్టీ ప్రధానకార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, ఒంగోలు నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళీకృష్ణతోపాటు జిల్లాలోని ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలతోపాటు పార్టీశ్రేణులు పాల్గొన్నారు.