ప్రకాశం

కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈదా సుధాకర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 20: కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈదా సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ మేరకు విజయవాడలోని రాష్టప్రార్టీకార్యాలయంలో ఈదాకు రఘువీరారెడ్డి నిమాయకపత్రాన్ని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ జిల్లా నూతన రథసారధిగా నియమితులైన ఈదా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. జిల్లాలోని కార్యకర్తనుండి నియోజకవర్గ నాయకులందరిని కలుపుకు పోయి రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఎంఎల్‌సి అభ్యర్థి రామచంద్రారెడ్డి గెలుపునకు తనవంతు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు. త్వరలో జిల్లాకమిటీ, మండల కమిటీలను ఏర్పాటుచేసి పార్టీపూర్వవైభవానికి కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈదా నియమాకం పట్ల ఒంగోలు నగర కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం హర్షం వ్యక్తం చేశారు.