ప్రకాశం

రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, ఫిబ్రవరి 20: నవ్యాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన ఉప్పుటూరి మురళీకృష్ణ ఆత్మీయ సత్కార సభ స్థానిక అద్దంకమ్మ ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి, సంక్షేమం విషయంలో మన రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తుందన్నారు. కేంద్రం నుంచి కూడా అధికంగా నిధులు మన రాష్ట్రానికే విడుదలౌతున్నాయని తెలిపారు. అటువంటి సమర్ధుడైన ముఖ్యమంత్రికి సచివాలయ ఉద్యోగులు సహకారం అందించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో కూడా మురళీకృష్ణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. సుమారు 1300 మంది ఉద్యోగులున్న సంఘం తరఫున 230 ఓట్లతో ఆయన రెండోసారి గెలవడం హర్షణీయమన్నారు. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన సహనశీలి అని కొనియాడారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో సావధానంగా చర్చించి వాటి పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావుతో పాటు తాను చీరాల్లోని వి ఆర్ ఎస్ అండ్ వై ఆర్ ఎన్ కళాశాల్లో చదివే రోజుల్లో ఉప్పుటూరి కూడా అదే కళాశాలలో విద్యాభ్యాసం చేశారన్నారు. మరో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఆయనకు సహకరిస్తే మరింత సమర్ధవంత పాలన అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పించిందన్నారు. ఉద్యోగ సంఘానికి మురళీకృష్ణ మంచి నాయకుడన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉప్పుటూరి దంపతులను మంత్రుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు, పర్చూరు ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు, 20 సూత్రాల పధకం ఛైర్మన్ శ్రీనివాస శేషసాయిబాబు, గుంటూరు సి ఐడి ఎస్పీ మోహనరావు, సచివాలయ ఉద్యోగ సంఘం సభ్యులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మేజర్ తోట రోశయ్య, ఎ ఎంసి ఛైర్మన్ యార్లగడ్డ అక్కయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

బోగస్ ఓట్లు 324
* 40మంది ఎంపిడిఒలకు,
17మంది ఎంఇఒలకు షోకాజ్‌నోటీసులు జారీ
* మరికొంతమంది తహశీల్దార్లకు నోటీసులు?

ఒంగోలు,్ఫబ్రవరి 20:ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో 324మంది ఓటర్లను బోగస్ ఓటర్లుగా అధికారులు చేర్చినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. సిట్టింగ్ ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఓటర్ల జాబితాపై వెరిఫికేషన్ జరిగింది. బోగస్‌ఓటర్లపై అధికారుల పరిశీలన ఆదివారంతో ముగిసింది. దీంతో తుది నివేదికను జిల్లా యంత్రాంగం రూపొందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించనుంది. ఈపాటికే బోగస్ ఓట్లను చేర్చిన 40మంది ఎంపిడిఒలు, 17మంది ఎంఇఒలకు జిల్లా యంత్రాంగం షోకాజ్‌నోటీసులు జారీచేసింది. అదేవిధంగా మరికొంతమంది తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిఇలాఉండగా జిల్లాలోని ఎంపిడిఒలు, తహాశీల్దార్లు, ఎంఇఒలు అంతర్మథనంలో పడ్డారు. ఓట్లను కష్టపడిచేర్చినా తాము బలిపశువులుగా మారుతున్నామని కొంతమంది సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోను తామే ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద జిల్లాలో 324 ఓట్లను మాత్రమే బోగస్‌ఓట్లుగా జిల్లాయంత్రాంగం తేల్చింది.

దొంగ ఓట్లను తొలగించాలి : సిపిఐ
కందుకూరు, ఫిబ్రవరి 20: ఎమ్మెల్సీ ఓట్లలో దొంగ ఓట్లను, అందుకు కారకులైన అధికారులను విధుల నుంచి తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో కె వీరారెడ్డి మాట్లాడుతూ అధికార ప్రభుత్వం తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అనర్హురులను ఓటర్లగా చేర్పించిందని, దాదాపు 20వేలు దొంగ ఓట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎస్‌ఏ గౌస్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తమ అభ్యర్థులు ఓడిపోతారన్న భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన విమర్శించారు. వామపక్షాల తరపున పోటీ చేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, పట్ట్భద్రుల అభ్యర్థి వై శ్రీనివాసులరెడ్డిలు ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు చేశారని, వారికి ఓట్లువేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి రాఘవులు, బి సురేష్‌బాబు, పి మాలకొండయ్య, డి రత్నం, ఆదినారాయణ, వై కొండయ్య, పృథ్వి, సిపిఎం నాయకులు జి వెంకటేశ్వర్లు, ఓ రామకోటయ్య, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు ఎస్ రావమ్మ, రవణమ్మ, ఎఐవైఎఫ్ నాయకులు వై ఆనంద్‌మోహన్, కోటి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.