ప్రకాశం

సర్వం శివమయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శుక్రవారం వేకువజాము నుండే భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు శివాలయాల వద్దకు చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని శైవక్షేత్రాలన్ని విద్యుత్‌కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని శైవక్షేత్రాల వద్ద నిర్వాహకులు క్యూలైన్లతో పాటు, అన్నదానం, మజ్జిగ, మంచినీళ్లు వంటిని ఏర్పాటుచేశారు. జిల్లాలోని పలుచోట్ల నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా శ్రీశైలం, కోటప్పకొండకు భక్తులు పరుగులు తీశారు. భక్తులు సౌకర్యార్థం జిల్లాలోని శైవక్షేత్రాలతోపాటు, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక ఆర్‌టిసి బస్సులను ఆర్‌టిసి అధికారులు ఏర్పాటుచేశారు. శ్రీశైలంకు గురువారం సాయంత్రం నుండి భక్తులు భారీగా వెళ్లగా, కోటప్పకొండకు మాత్రం శుక్రవారం రాత్రినుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్ళారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్‌టిసి అధికారులు ఆయాడిపోల వద్ద షామీయానాలను ఏర్పాటుచేశారు. ఇదిఇలాఉండగా జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన భైరవకోనలోని స్వామివారిని జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. అదేవిధంగా మిట్టపాలెం నారాయణస్వామిని దర్శించుకున్నారు. కాగా ముందుగా ఒంగోలులోని శివాలయాన్ని మాగుంట సందర్శించారు.
ఇదిఇలాఉండగా జిల్లాలోని భైరవేశ్వరస్వామి ఆయలం, మడనూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కనపర్తిలోని ఏలేశ్వరస్వామి ఆలయం, జెపంగులూరులోని కొండమూరు మల్లేశ్వరస్వామి ఆలయం, రామతీర్థంలోని మోక్షరామలింగేశ్వరస్వామి ఆలయం,టంగుటూరులోని నాగేశ్వరస్వామి ఆలయం, మంగమూరులోని మల్లేశ్వరస్వామి ఆలయం, మిట్టపాలెంలోని నారాయణ స్వామి ఆలయం, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, ఒంగోలులోని కాశీవిశే్వశ్వరస్వామి ఆలయాల్లో ప్రధానంగా భక్తులు పోటేత్తారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోను శివరాత్రి పర్వదినం సందర్బంగా శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. మొత్తంమీద జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు శివభక్తి నామస్మరణలతో మునిగిపోయారు. ఇదిఇలాఉండగా శైవక్షేత్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీబందోబస్తును ఏర్పాటుచేసింది.

రేపే గ్రూప్ -2 పరీక్షలు
హాజరుకానున్న 31,112మంది విద్యార్థులు
84 కేంద్రాల్లో పరీక్షలు
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-2 పరీక్షలు ఈనెల 26వతేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే అభ్యర్థులు ఉదయం 9గంటల నుండి 9.45 గంటల్లోపు పరీక్ష హాలులోకి హాజరుకావాల్సి ఉంది. 9.45గంటల తరువాత ఎవరిని కూడా పరీక్షా హాల్లోకి అనుమతులు ఇవ్వరు. జిల్లాలోని 84కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈపరీక్షలకు 31,112మంది విద్యార్ధులు హాజరుకాన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు హాల్‌టిక్కెట్‌తోపాటు అభ్యర్థికి చెందిన వర్జినల్ ఐడి కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఎదోఒకటి తప్పనిసరిగా పరీక్షా హాలులోకి తీసుకురావాలి. దివ్యాంగుల తరపున పరీక్షా రాసే ఒక అభ్యర్థిని తీసుకురావచ్చు. అతనికి కూడా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. దివ్యాంగులు మాత్రం ధ్రువీకరణ పత్రంతోపాటు డిక్లరేషన్ ఫారాన్ని జతచేయాలి. దివ్యాంగులు, గర్భిణులకు మాత్రం కేంద్రాల్లో దిగువఫ్లొర్‌లో పరీక్షలు జరగనున్నాయి. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేయటమేకాకుండా విద్యార్ధులకు అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసేందుకు విద్యాశాఖ రంగం సిద్దం చేసింది. జిల్లాలోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజిలో ఐదువందలమంది, కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో 150మంది పరీక్షలు రాయనున్నారు. అదేవిధంగా కందుకూరులోని టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీకాలేజిలో 153మంది, టిఆర్‌ఆర్ జూనియర్ కాలేజిలో రెండువందలమంది, జిల్లాపరిషత్ బాలికలహైస్కూలులో 250మంది, జిల్లాపరిషత్ బాలుర హైస్కూలులో 240మంది, నారాయణ జూనియర్ కాలేజిలో 150మంది, శ్రీ గాయత్రి విద్యాపరిషత్ జూనియర్ కాలేజిలో రెండువందలమంది, శ్రీప్రతిభ డిగ్రీకాలేజిలో 250మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదేవిధంగా మార్కాపురం డివిజన్‌లోని మార్కాపురంలో శ్రీ సాధన జూనియర్ కాలేజిలో ఏడువందలమంది, డాక్టర్ శామ్యూల్ జార్జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి కాలేజిలో ఆరువందలమంది, ఇందిరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి సైన్స్‌స్ కాలేజిలో వెయ్యిమంది, బాష్యం పబ్లిక్‌స్కూలులో మూడువందలమంది, నారాయణ ఇంగ్లీషుమీడియం స్కూలులో మూడువందలమంది, ఎస్‌వికెపి ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజిలో మూడువందలమంది, జిల్లాపరిషత్ బాలికల హైస్కూలులో 360మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. చీరాలలోని ప్రభుత్వ జూనియర్ మహిళాకాలేజిలో 350మంది, ఎకెపి అండ్ పికె జూనియర్‌కాలేజిలో 250మంది, సెయింట్ మార్క్స్ లూధరన్ జూనియర్ కాలేజిలో 150మంది, విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజిలో 800మంది, శ్రీవాణి జూనియర్‌కాలేజిలో 150మంది, శ్రీ గౌతమి జూనియర్ కాలేజిలో రెండువందలమంది, శ్రీ మేధా జూనియర్‌కాలేజిలో రెండువందలమంది, భారతి జూనియర్ కాలేజిలో 250మంది, భారతి డిగ్రీకాలేజిలో 250మంది, విజ్ఞాన్‌భారతి జూనియర్ కాలేజిలో 250మంది, శ్రీ ఎన్‌ఎన్‌ఎస్ విద్యాడిగ్రీకాలేజిలో 200మంది, శ్రీ విద్యాజూనియర్ కాలేజిలో రెండువందలమంది, చైతన్యభారతి డిగ్రీకాలేజిలో రెండువందలమంది, ఎఆర్‌ఎం హైస్కూలులో 250మంది, కెజిఎం బాలికల హైస్కూలులో 220మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదేవిధంగా ఒంగోలులోని నారాయణ జూనియర్ కాలేజిలో 240, ఉమమాహేశ్వరకాలేజిలో 240, శ్రీహర్షిణి డిగ్రీ, పిజికాలేజిలో 300మంది, అదేకాలేజిలోని బెతూన్ నర్సింగ్ హోం వద్ద 1050మంది, ఎకెవికె డిగ్రీ,పిజికాలేజిలో 450మంది, క్విస్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజిలో 1800మంది, క్విస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో వెయ్యిమంది, క్విస్ కాలేజి ఆఫ్ ఫార్మసిలో మూడువందల మంది, ఎస్‌ఎస్‌ఎన్ డిగ్రీకాలేజిల 450మంది, ఎస్‌ఎస్‌ఎన్ జూనియర్‌కాలేజిలో 250మంది, శ్రీ నాగార్జున డిగ్రీకాలేజిలో 500మంది, శ్రీచైతన్య జూనియర్ కాలేజిలో 250, సెయింట జెవియర్స్ బాలికల జూనియర్ కాలేజిలో 350, రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో 1200మంది, రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ 720, రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్ కాలేజిలో 720,పెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో 1440, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో 350మంది, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీకాలేజిలో 250మంది, సిఎస్‌ఆర్ శర్మాకాలేజిలో 400, శ్రీ సూర్య ఎడ్యూకేషన్ సొసైటీలో మూడువందలమంది, క్విస్ హైస్కూలులో 480, డ్రీమ్స్ స్కూలులో 240, విజ్ఞాన్ స్కూలులో 250, సెయింట్ జెవియర్స్ హైస్కూలులో 350, మాంటిస్సోరి హైస్కూలులో 250, బాష్యంహైస్కూలులో 360, శ్రీ చైతన్య హైస్కూలులో రెండువందలు, అదేస్కూలులోని భాగ్యనగర్‌ల 240, అదేస్కూలులోని లాయరుపేటలో 300మంది, ఎస్‌ఆర్‌కె డిగ్రీకాలేజిలో మూడువందలమంది, ఎకెవికె జూనియర్‌కాలేజిలో 450,శ్రీచైతన్యజూనియర్ కాలేజిలో 240, శ్రీప్రతిభ జూనియర్ కాలేజిలో 250, శ్రీగురుదత్త హైస్కూలులో 240,ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్‌కాలేజిలో వెయ్యిమంది, మంగమూరు రోడ్డులోని శ్రీచైతన్య హైస్కూలులో 240, ఫేస్ ది గ్లోబల్‌స్కూలులో 250, రవీంధ్రభారతి స్కూలులో 240, శ్రీ శాంతి నికేతన్ స్కూలులో 150, శ్రీ సూర్యవిద్యానికేతన్‌లో 200మంది, ఆక్ప్‌ఫర్డ్ ఇంగ్లీషుమీడియం స్కూలులో 200, కృష్ణమెమోరియల్ ఇంగ్లీషుమీడియంలో 160, శ్రీసాయి కనె్పప్ట్‌స్కూలులో 300, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో 400, శ్రీ రామకృష్ణ ఇంగ్లీషుమీడియం హైస్కూలులో 120, ఆర్కిడ్ హైస్కూలులో రెండువందలు, రవీంధ్రభారతి హైస్కూలులో 150, ఆంధ్రాస్కూలులో 140, గాంధీ పబ్లిక్‌స్కూలులో 160, ఎన్‌ఎన్‌ఆర్ అండ్ సిఎల్ డిగ్రీకాలేజిలో నాలుగువందలు, రత్నం హైస్కూలులో 250, విక్రం హైస్కూలులో 160మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

ప్రకాశం ఎడ్ల సంపద మనకెంతో గర్వకారణం
ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడి
పొదిలి, ఫిబ్రవరి 24 : ప్రకాశం జిల్లా జాతి ఎడ్ల సంపద మనకెంతో గర్వ కారణమని ఎమ్మెల్సీ, జాతీయ టిడిపి ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కనిగిరికి వెళుతూ మార్గమధ్యలోని పొదిలిలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నిర్మమహేశ్వరస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా శివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి హాజరై కొద్దిసేపు తిలకించారు. ప్రకాశం ఎడ్ల ఆహ భావాలను, వాటి రాజసాన్ని చూసిన మాగుంట పులకరించి పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత మన జాతి ఎడ్ల సంపదకు ఉందన్నారు. ఇది మన ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రానికి కూడా ఎంతో గర్వకారణమన్నారు. కష్ట నష్టాలు పడుతూ ఎడ్లను పోషిస్తున్న యజమానుల కృషి అభినందనీయమన్నారు. ప్రపంచానికే తలమానికగా నిలిచిన జిల్లా ఎడ్ల సంపదను పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఎడ్ల సంపదను ప్రోత్సహించే విధంగా అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మన దేశ, రాష్ట్ర గౌరవాన్ని ఔనత్యాన్ని ప్రపంచ దేశాల్లో నలుదిక్కులా చాటి చెబుతున్న ప్రకాశం జిల్లా జాతి ఎడ్ల సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మ మహేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శామంతపూడి నాగేశ్వరరావు, టిడిపి నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, వై వెంకటేశ్వరరెడ్డి, కాటూరి వెంకట నారాయణబాబు, షేక్ జిలానీ బాషా, యస్ రసూల్, తానికొండ వెంకట్రావు, మర్రిపూడి ఎంపిపి వై సుశీల , వై శ్రీనివాసులు, కల్లూరి చిన్న సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

భైరవకోన అభివృద్ధికి కృషి
* ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి హామీ
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 24: భైరవకోన అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం త్రిముఖ దుర్గాదేవి, ఈశ్వరుడు, భైరవుడు కొలువై ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం భైరవకోన ఆలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భైరవకోన కొన్ని దశాబ్ధాల నాటి అద్భుతమైన దేవాలయం అన్నారు. ప్రధానంగా ఒక కొండలో ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ఇక్కడ స్వచ్ఛమైన జలపాత సెలయేరులో మెళవించుకున్న అద్భుత పుణ్యక్షేత్రమన్నారు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకకేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ఈ భైరవకోనకు నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి ప్రజలు విరివిగా వస్తారని భైరవకోన అభివృద్ధికి తనవంతు కృషిచేస్తామన్నారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖమంత్రి డాక్టర్ మహేష్‌శర్మ దృష్టికి తీసుకెళ్లి భైరవకోనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు.
ఘనంగా పార్వతి పరమేశ్వరుల కల్యాణం
చీరాల, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో కొట్లబజారులోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం పార్వతి - పరమేశ్వరుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా గణపతి పూజ, అభిషేకం, అర్చన అనంతరం వేదమంత్రాలతో శివునికి కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం గావించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.