ప్రకాశం

సత్తాచాటిన ప్రకాశం ఎడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, ఫిబ్రవరి 28: మండలంలోని ముండ్లపాడు గ్రామంలో వెలసిన భవానీశంకరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాలపండ్ల సైజు ఎడ్లు బండలాగు పోటీలను ఎమ్మెల్యే ఎం అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామానికి చెందిన కె పెద్దిరెడ్డి ఎడ్లజత 3600 అడుగులు లాగి ఆ గ్రామపెద్ద తిరువీధి గురుమూర్తి బహుకరించిన రూ.30 వేలను కైవసం చేసుకున్నాయి. కర్నూలు జిల్లా పాలూరుకు చెందిన మహేశ్వరరెడ్డికి చెందిన ఎడ్లజత 3339 అడుగులు లాగి బొమ్మినేని వెంకటేశ్వర్లు బహుకరించిన రూ.20 వేల నగదును కైవసం చేసుకోగా, గిద్దలూరు మండలం మోడంపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల ఎడ్లజత 3300 అడుగులు లాగి సర్పంచ్ కడియం శేషగిరి బహుకరించిన రూ.10 వేలను, కర్నూలు జిల్లా కానాలకు చెందిన ఇమామ్‌హుస్సేన్‌కు చెందిన ఎడ్లజత 3130 అడుగులు లాగి శీలం రంగారెడ్డి బహుకరించిన రూ.5 వేలను దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు జాతి గిత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఒంగోలు జాతిగిత్తలే ఆకర్షింపబడుతున్నాయని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేదే ఈ బండలాగు పందేలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె వంశీధరరెడ్డి, సర్పంచ్ శేషగిరి, రాజశేఖర్‌రెడ్డి, ఎంపిటిసి నవీన్, బి వెంకటేశ్వర్లు, శీలం రంగారెడ్డి, స్వామిరంగారెడ్డి, కొండయ్యయాదవ్, సర్పంచ్ గోపాలకృష్ణ, బడేసాహెబ్, పెద్దరామిరెడ్డి, పి ప్రతాప్‌రెడ్డి, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.