ప్రకాశం

అధికారుల్లో బదిలీల ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఏప్రిల్ 12: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు ప్రస్తుతం పరీక్షల సీజన్ ముగియడంతో బదిలీలు తప్పవని భావించిన కొందరు అధికారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో బదిలీల పర్వం ప్రారంభం కావడంతో తమ స్థానం ఎక్కడ చేజారుతుందోనన్న ఆందోళనలో పోలీసు అధికారులు పదిలమైన సీటు కోసం రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ప్రకాశంలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు తూర్పువైపు దృష్టి సారించగా, ఎంతోకాలంగా పశ్చిమ ప్రకాశంలో పనిచేస్తున్న అధికారులు ఇదే ప్రాంతంలో ఏదొక పోలీసుస్టేషన్‌లో ఉండేందుకు పైరవీలు సాగిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కూడా బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో మరోచోటనైనా మంచి కుర్చీ సంపాదించాలనే ధ్యేయంతో అధికారపార్టీ నేతలకు సలామ్ కొడుతూ ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. అలాగే ఏప్రిల్ 25వ తేదీ తరువాత అన్ని శాఖల్లో బదిలీల పర్వం ప్రారంభం కానుండడంతో అన్నిశాఖల అధికారులు అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఏదిఏమైనా దీర్ఘకాలంగా ఇదే డివిజన్‌లో పనిచేస్తున్న పలు శాఖల ఉద్యోగులు ఈ డివిజన్ నుంచి వెళ్ళకుండా ఇక్కడే మకాం వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, టిడిపి పాలనలో అధికారుల బదిలీలు కావాలన్నా, ఇక్కడే పోస్టింగ్ ఇవ్వాలన్నా తప్పనిసరిగా అక్కడి ఎమ్మెల్యే కాని, ఇన్‌ఛార్జిలు కాని విధిగా ఉత్తరం ఇవ్వాల్సి రావడంతో అధికారపార్టీ నేతలకు డిమాండ్ పెరిగింది.