ప్రకాశం

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 16 : జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 40,843 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 39,565 మంది కాగా, ప్రైవేటు విద్యార్థులు 1278 మంది హాజరవుతారని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 188 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 10వ తరగతి పరీక్షలను తనిఖీ చేసేందుకు పదిమంది డిప్యూటీ తహశీల్దార్లను ఫ్లయింగ్ స్వ్కాడ్‌లుగా నియమించినట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు ప్రతిరోజు తనిఖీలు చేపడతారని తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని తప్పనిసరిగా నియమించాలన్నారు. వికలాంగ విద్యార్థులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారి సాల్మన్, డిప్యూటీ తహశీల్దార్లు వాసుదేవరావు, జయరావు, కోటేశ్వరరావు, దయానందం, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఎప్పటికి పూర్తయ్యేనో..?
బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.200 కోట్లు కేటాయింపు * 2018 జూన్ నాటికి ఫేస్ వన్ పూర్తికావటం కలేనా?

ఒంగోలు, మార్చి 16 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ఫేస్ వన్ 2018 సంవత్సరం జూన్ నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపించటంలేదు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులతోపాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఈ నిధులు ఎందుకు పనికివస్తాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అధిక నిధులు వెచ్చించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా రూ.2800 కోట్లు అవసరం కాగా కేవలం రూ.200 కోట్లు ఎంతవరకు సరిపోతాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో చేస్తానని హామీ ఇస్తూనే ఉన్నారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటాయించడం, వచ్చే బడ్జెట్‌లో కూడా ఇదే తరహాలో నిధులను కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందో ఆ దేవుడికే తెలియాల్సి ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోను వెలుగొండను బూచిగా చూపి పశ్చిమప్రాంత నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకంగానే నిధులను తగ్గించిందా, లేక బడ్జెట్‌లో నిధులు లేవా అన్న చర్చ అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలాఉండగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షలమంది ప్రజలకు మంచినీటి వసతిని కల్పించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును రూ.5,150 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల్లోని మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వరంగా చెప్పుకోవచ్చు. కాని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవటం పట్ల ఆ ప్రాంత వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో ఒకలక్షా 19వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో పనులను నాలుగు ప్యాకేజిలుగా విభించారు. మొదటిదశలో మొదటిసొరంగం 18.820 కిలోమీటర్లకు గాను 13.761 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. రెండవ దశలో రెండవ సొరంగం 18.838 కిలోమీటర్లకు గాను 10.301 కిలోమీటర్ల మేర పూర్తిచేశారు. సొరంగాల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో పనులు వేగవంతం కావటంలేదు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన బిల్లులే రూ.50 కోట్లు ఇవ్వాల్సిఉండగా కేవలం రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే ఏ విధంగా సరిపోతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ మొదటి దశ పనులకు ఈ విధంగా నిధులు కేటాయిస్తే నిర్దిష్ట సమయానికి పనులు పూర్తికావనేది జగమెరిగిన సత్యమే. కాగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వెయ్యి కోట్లు కేటాయించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డితోపాటు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. మొత్తంమీద వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

చెరువులో పడి ఒకరి మృతి
సింగరాయకొండ, మార్చి 16: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం సింగరాయకొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన కె శ్రీను (38) తన మిత్రునితో కలిసి సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని కొండ్రాజుకుంట చెరువులో చేపలను చూసేందుకు వెళ్లాడు. అయితే శ్రీను ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మృతిచెందాడు. తోటి మిత్రులు మృతదేహాన్ని శ్రీను ఇంటికి తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సిహెచ్ హజరత్తయ్య పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

జగన్ రాకతో జనసంద్రంగా మారిన దర్శి
దర్శి, మార్చి 16 : వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో గురువారం దర్శి పట్టణం జనసంద్రంగా మారింది. అమరావతి నుంచి కడపకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డి దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆహ్వానం మేరకు దర్శి పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో కొంతసేపు సేదతీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో దర్శి పట్టణానికి జగన్ వస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న నియోజకవర్గంలోని ఐదు మండలాల వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్శి పట్టణానికి చేరుకున్న జగన్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ గడియార స్తంభం సెంటర్‌లో వాహనంపై కొంతసేపు కార్యకర్తల కోసం అభివాదం చేస్తూ ప్రయాణించారు. దీంతో పట్టణమంతా ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోయింది. ముందస్తు సమాచారం లేకపోయినా భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం పట్ల జగన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో కొంతసేపు సేదతీరి కార్యకర్తలతో ముచ్చటించారు. శివప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేసిన తేనేటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మాజీ మండల అధ్యక్షురాలు బూచేపల్లి వెంకాయమ్మ, ఆ పార్టీ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, కెవి రెడ్డి, సోము దుర్గారెడ్డి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.