ప్రకాశం

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మార్చి26: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి నారాయణ అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఆయన చీరాల వచ్చారు. సుమారు రూ.2కోట్లతో నిర్మించిన నెహ్రూ కూరగాయల మార్కెట్‌ను మరో మంత్రి రావెల కిషోర్‌బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడూతూ రూ.24,500 కోట్లతో రైతు రుణమాఫీ కోసం కేటాయించామన్నారు. 43వేల కుటుంబాలకు రూ.5,700 కోట్లతో సామాజిక పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీకి కట్టుబడ్డామన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో 59 మున్సిపాలిటీల్లోని పురపాలక పాఠశాలల్లో కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించామన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేటు పాఠశాలలుగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రం లోని 13 జిల్లాల్లో లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో తాగునీరు, విద్యుత్, మురుగు కాల్వలు, పాఠశాలలు వంటి అన్ని హంగులతో లక్షా 23వేల ఇళ్లను త్వరలో నిర్మించి లబ్దిదారులకు అందజేస్తామన్నారు. డంపింగ్ యార్డులకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 జిల్లాల్లో అందుకు సంబంధించి టెండర్లు పిలిచామన్నారు. ఆ యూనిట్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని సంకల్పించామన్నారు. 2019 ఆక్టోబర్ నాటికి దేశాన్ని ఒ డి ఎఫ్‌గా ప్రకటించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెడితే 2016 అక్టోబర్ నాటికే 110 మున్సిపాలిటీలను ప్రకంటించడం జరిగిందన్నారు. పురపాలకశాఖలో సంస్కరణలు తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. చీరాల నియోజకవర్గంలో సాలిడ్ వేస్టు మేనేజిమెంటు యూనిట్ ప్రారంభించడం హర్షణీయమన్నారు. నియోజకవర్గానికి సబ్‌ప్లాన్ నిధులు రూ.17కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హామి ఇచ్చారు. నియోజకవర్గంలోని ముఖ్యమైన సమస్యలపై సమగ్ర నివేదికతో వస్తే వాటి పరిష్కారానికి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం లోని దళిత వాడల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అదేవిధంగా సబ్‌ప్లాన్ నిధుల కింద రూ.600 కోట్లు కేటాయించామన్నారు. అంతకుముందు వేటపాలెం మండలం పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల్లో రూ.2కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం, 5వేల ఎకరాల ఆయకట్టు భూముల స్థిరీకరణకు ఉపకరించే చెక్ డ్యామ్, వేటపాలెం గడియార స్తంభం కూడలి నుంచి కటారిపాలెం వై జంక్షన్ వరకు నిర్మించనున్న రహదారి, రామాపురంలోని అబ్దుల్ కలాం కాలనీలో ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వేటపాలెం మండలం రామాపురంలో 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.5కోట్లతో నిర్మించిన సాలిడ్ వేస్టు మేనేజిమెంటు యూనిట్‌ను మంత్రులు శిద్దా రాఘవరావు, రావెల కిషోర్‌బాబుతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బి ఎన్ విజయ్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ సి ఎల్ వెంకట్రావు, మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్, కమిషనర్ తలారి బ్రహ్మయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.