ప్రకాశం

ప్రోటోకాల్ పాటించరా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మార్చి28: ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచుల విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించరా అని టిడిపి మహిళా సర్పంచ్‌లు దుడ్డు రూపవతి, బట్ట అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో విజయనగర్ కాలనీలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాద్ధాంతం చేశారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు అదే ప్రోటోకాల్ అంశాన్ని పట్టించుకోకుండా సర్పంచ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. రూ.10 లక్షల ఎంపి నిధులు, రూ.40లక్షల సబ్‌ప్లాన్ నిధులు రాబట్టేందుకు తాను ఎంతో కృషి చేస్తే రోడ్డు విజయనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణం చేశానని సర్పంచ్ రూపవతి తెలిపారు. అయితే తనకు తెలియకుండా ఎమ్మెల్యే వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వాపోయారు. రామన్నపేట సర్పంచి అనంతలక్ష్మి మాట్లాడుతూ రూ.32లక్షల నిధులతో స్ర్తిశక్తి భవనం నిర్మించడానికి తాను ఎంతో కృషి చేశానన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకుండా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తమను పిలవకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపిపి గవిని శ్రీనివాసరావు, కొత్తపేట ఉప సర్పంచి కౌతరపు జనార్ధనరావు, టిడిపి జల్లా ఉపాధ్యక్షుడు బట్ట లీలానందప్రసాదు, వేటపాలెం తెలుగు యువత అధ్యక్షుడు వాసు, మాఘం మురళి, దల్లి లక్ష్మారెడ్డి, పోతుల ప్రకాష్, కొల్లా చైతన్య తదితరులు పాల్గొన్నారు.

నివాసాల మధ్య మద్యం దుకాణాలు
ఏర్పాటు చేస్తే సహించం
* శ్రామిక మహిళా సంఘం డిమాండ్
* మద్దతు తెలిపిన వామపక్షాలు
కందుకూరు, మార్చి 28: పట్టణంలోని కోవూరు రోడ్డులో గల విజయనగర్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణ నిర్మాణ పనులను ఐద్వా, శ్రామిక మహిళా సంఘం మహిళలు అడ్డుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని వారు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్యలో ఏర్పాటు చేయనున్న మద్యం షాపులను తొలగించాలని కోరుతూ మంగళవారం మహిళలు ఆందోళన చేపట్టారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కె మున్వర్ సుల్తానా, సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎం మనోజ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిఐ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పట్టణ ఎస్‌ఐలకు ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దని వినతిపత్రం అందజేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణం ఎదురు టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలతోపాటుగా పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలతోపాటుగా ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. అదే విధంగా సాయిబాబా మందిరం, ఆంజనేయస్వామి గుడి, కనకదుర్గమ్మ దేవాలయం, చర్చిలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో నిరంతరం విద్యార్థులు, మహిళలు నిరంతరం రాకపోకలు జరుపుతుంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు వారికి మద్దతు తెలిపి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా డివిజన్ కార్యదర్శి ఎస్‌కె మల్లిక, శ్రామిక మహిళా డివిజన్ నాయకులు ఎస్‌కె పరీదా, సిఐటియు నాయకులు ఎస్ పవన్‌కుమార్, వరలక్ష్మీ, పద్మ, తులసమ్మ, కె నారాయణమ్మ, అనుసూయమ్మ, లక్ష్మమ్మ, ఎల్ దుర్గ, ఎస్‌కె ఆశ, శాంతి, రాజ్యలక్ష్మీ, ఎన్ శాంతి, భాగ్యమ్మ, సుబ్బమ్మ, వెంకటరావు, సురేష్, అంజయ్య, రత్తమ్మ, ఎం భారతి తదితరులు పాల్గొన్నారు.