ప్రకాశం

లారీల సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 28: ఈనెల 30న రాష్టవ్య్రాప్తంగా లారీల సమ్మెకారణంగా జిల్లాప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో అధికారులతో లారీల సమ్మెపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లారీల సమ్మె నేపధ్యంలో జిల్లాలో ప్రజలకు పాలు, గ్యాస్, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్ తదితర వస్తువులకు ఎలాంటి లోటులేకుండా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. వాటిని రవాణా చేసే వాహనాలకు అవసరమైన పోలీసు ఎస్కార్టు ఏర్పాటుచేయాలన్నారు. రైతులు తాము పండించిన కూరగాయలను రవాణా చేసుకునేందుకు ఆర్‌టిసి బస్సుల్లో అనుమతించాలన్నారు. అవసరమైనప్పుడు ట్రక్కులు, ట్యాంకర్లు నడిపేందుకు ఆర్‌టిసి డ్రైవర్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా వాహనాలు అవసరమైతే సమకూర్చేందుకు రవాణాశాఖాధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా లారీల అసోసియేషన్ల వారు నిత్యావసర వాహనాలు అడ్డుకున్న పెట్రోలు, డీజిల్ బంకులు, గ్యాస్ డిపోల వద్ద లేనిపోని రాద్ధాంతం చేసిన పోలీసులు కేసులు బనాయించి జైలుకు పంపించాలని సూచించారు. పోలీసులు, రవాణా, రెవిన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతోపనిచేసి ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికలను రూపొందించుకుని అమలుచేయాలన్నారు. ఈనెల 29వతేదీనాటికి అన్ని గ్యాస్ గోదాములను గ్యాస్ సిలిండర్లతో భర్తీ చేసుకోవాలని సూచించారు. ఒంగోలు డెయిరీ ద్వారా జిల్లాలోనిప్రజలకు కావాల్సినంత పాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. లారీల సమ్మెవలన ఎవరికైనా ఇబ్బందులుంటే తెలిపితే పరిష్కరిస్తామని, ఇందుకోసం కలెక్టరేట్‌లో 1077 టోల్‌ఫ్రీ నెంబరుతో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.సంబంధిత అధికారులు వారి పరిధిలో సమావేశాలు నిర్వహించుకుని క్షేత్ర స్ధాయివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సరైన వ్యూహణ రూపొందించుకోవాలన్నారు. ఈసమావేశంలో అదనపు ఎస్‌పి దేవదానం, జిల్లారెవిన్యూఅధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఆర్‌డిఒ శ్రీనివాసరావు, డిఎస్‌పి రాంబాబు, డిటిసి సుబ్బారావు, ఆర్‌టిసి ఆర్‌ఎం ఆదాంసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.