ప్రకాశం

ధర్మవరం కిడ్నీ బాధితులకు కేంద్ర బృందం పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి, మార్చి 28 : మండలంలోని ధర్మవరంలో కిడ్నీ బాధితులను కేంద్ర వైద్యబృందం పరిశీలించి వ్యాధికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ తెలిపారు. కేంద్రం నుండి వచ్చిన వైద్యబృందం సభ్యులు గ్రామంలో ఉన్న కిడ్నీ రోగులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎలాంటి నీరు తాగుతున్నారని అడుగ్గా రోగులు సిపిడబ్ల్యూ స్కీము వాటర్ గత రెండు సంవత్సరాలుగా మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా తాగునీటిని వినియోగించుకుంటున్నామన్నారు. కేంద్ర వైద్య బృందం 20కి పైగా తాగునీటి శాంపుల్స్‌ను సేకరించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి వైద్యబృందాన్ని పంపడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కిడ్నీ వ్యాధి బాధితులు కేంద్ర బృందంతో వారి సమస్యలను తెలిపారు. గత పది సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ 14 మందికిపైగా మృత్యువాత పడటం జరిగిందని, ప్రస్తుతం గ్రామంలోని మరో ముగ్గురు ఒంగోలు అనీష్ కిడ్నీ హాస్పిటల్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నామని, మరో 30 మందికి పైగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య బృందానికి బాధితులు తెలిపారు. ఈ బృందంలో ఫ్లోరోసిస్ రీసెర్స్ నిపుణులు డాక్టర్ ఏకె సుశీల, డాక్టర్ రవిరాజ్, డాక్టర్ తొటేజా, డాక్టర్ గంగాధర్, జిల్లా ఫ్లోరోసిస్ నిపుణులు డాక్టర్ సత్య నారాయణ, డాక్టర్ ప్రవీణ్ కౌర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ మర్థన్ ఆలీ తదితరులు ఉన్నారు.