ప్రకాశం

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో రూ 592 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఏప్రిల్ 3: రాష్ట్రంలో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి 592 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని రీజనల్ టౌన్ ప్లానింగ్ ఆర్‌డి ప్రదీప్‌కుమార్ తెలిపారు. సోమవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 74489 అక్రమ భవన నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అందులో 52వేల భవనాలను యజమానులు క్రమబద్థీకరించుకున్నారని, దీంతో 592 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. గుంటూరు రీజియన్‌లో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ ద్వారా 150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మార్కాపురం పట్టణంలో 72మంది దరఖాస్తు చేసుకోగా 34 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. భవన నిర్మాణాల క్రమబద్ధీకరణలో ఏమేరకు స్థలాన్ని దరఖాస్తు చేసుకుంటారో ఆమేరకే అనుమతులు ఇవ్వాలని, అక్రమంగా ఎక్కువ స్థలానికి అనుమతి ఇస్తే సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు కూడా అనుమతికి దరఖాస్తు చేసుకున్న స్థలానికి మాత్రమే చలానాలు వసూలు చేయాలని, అదనంగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే ముందుగా నోటీసులు జారీచేసి అందుకు స్పందించకుంటే భవనాలను కూల్చివేయడం జరుగుతుందని ఆయన యజమానులకు హెచ్చరికలు జారీచేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే వారి నుంచి చలానాలు తీసుకొని క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టౌన్‌ప్లానింగ్ అధికారి షబ్బీర్, లైసెన్సు సర్వేయర్లు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం గేటు బయట
వివాహిత ఆత్మహత్యాయత్నం
ఒంగోలు, ఏప్రిల్ 3: తన భర్త నుండి తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్‌సెల్‌లో ఎస్‌పి త్రివిక్రమవర్మకు అర్జీ ఇచ్చేందుకు వచ్చి జిల్లా పోలీసు కార్యాలయం గేటు బయట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్రమాత్రలు మింగి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనను తెలసుకున్న అక్కడి పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేసి బాధితురాలిని వైద్యచికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించగా ఆమె ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. బాధితురాలు చిరుకూరపాటి లక్ష్మివాణి (30) అనే వివాహిత మహిళ తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని గుడ్లూరు కు చెందిన చెరుకూరపాటి వీరబ్రహ్మంతో గత 9 సంవ్సరాల క్రితం తనకు వివాహం జరిగినట్లు ఆమె తెలిపారు. తమకు 5 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక కుమారుడు కూడా వున్నట్లు ఆమె తెలిపారు. తన భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగికావడంతో తమ కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే తన భర్త వీరబ్రహ్మం ఆయన చేసే కంపెనీలోని ఒక మహిళతో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుని తనను ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు. ఇదేమి అని ప్రశ్నిస్తే ఆమె మాటలు విని తన భర్త తనపై లేనిపోని అనుమానాలను అంటగడుతూ తనను ఇబ్బందులు పెడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో తన భర్త వీరబ్రహ్మం వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె నుండి తన భర్తను వేరు చేసి తనకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ తనకు న్యాయం జరగకపోవడంతో అప్పటిలో అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో కూడా కలిసి సమస్యను తెలియజేసినప్పటికి వారిలో సరైన స్పందన లేకపోవడంతో తాను హైదరాబాద్‌లో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగకపోతే ఎప్పుడైనా తాను ఆత్మహత్య చేసుకుంటాని పోలీసులకు తెలియజేసినట్లు ఆమె తెలిపారు. అయితే గత రెండు నెలల క్రితం తన భర్త తనను దర్శిలోని తన పుట్టింటి వారి ఇంటి దగ్గర వదిలివేసి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నట్లు ఆమె తెలిపారు. దీంతో తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నాడు ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీవెన్స్ సెల్‌లో అర్జీ ఇచ్చేందుకు వచ్చి గేటు బయటనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నంకు పాల్పడినట్లు తెలిపారు. తాను ఒక హౌస్‌వైఫ్ అని తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె కోరారు.