ప్రకాశం

అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 3:రాష్ట్ర అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజి శాఖలమంత్రిగా జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు శిద్దాకు ఉన్న రోడ్లుభవనాలు, రవాణాశాఖల మంత్రుల పదవులను వేరే మంత్రులకు కేటాయించారు. కాగా మంత్రి శిద్దాకు అప్రాధాన్యత గల పదవులను ముఖ్యమంత్రి కేటాయించారని తెలుగుతమ్ముళ్లతోపాటు, ఆయన అనుచరగణం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోను, మంత్రుల శాఖల కేటాయింపుల్లోను జిల్లాకు అన్యాయమే జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం శిద్దాకు కేటాయించిన శాఖల వలన జిల్లా అభివృద్ధిపై తన శాఖల పరిధిలో ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందోనన్న చర్చ పార్టీశ్రేణుల్లో సాగుతుంది. ప్రస్తుతం రోడ్లుభవనాల శాఖ మంత్రి శిద్దా చేతిలో ఉండటంతో జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కొన్ని జరగ్గా, కొన్ని పూర్తయ్యాయి. ప్రధానంగా దొనకొండ పారిశ్రామిక కారిడార్‌కు అనుసంధానంగా రోడ్ల అభివృద్ధి జరిగే సమయంలో శిద్దాకు రోడ్లు భవనాల శాఖను తీసివేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని డొంకరోడ్లన్ని తారురోడ్లు, సిమెంటు రోడ్లు చేస్తానని తరుచుగా మంత్రి శిద్దా విలేఖర్ల సమావేశంలో ప్రకటించేవారు. కాని ప్రాధాన్యత కలిగిన ఆ పదవి ఆయన దగ్గర లేకుండా పోవటంతో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా దర్శి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధితోపాటు, దోర్నాపువాగుపై బ్రిడ్జిని కూడా మంజూరు చేయించారు. అదేవిధంగా దర్శిలో డ్రైవింగ్ స్కూలును కోట్లాది రూపాయల నిధులతో మంజూరు చేయించారు. జిల్లాతోపాటు, రాష్టవ్య్రాప్తంగా రోడ్ల అభివృద్ధికి మహర్దశ కల్పించారు. కాని నేడు ఆ శాఖలు లేకపోవటంతో ఆ ప్రభావం అభివృద్ధిపై పడుతుందన్న వాదన పార్టీశ్రేణుల నుండి వినిపిస్తొంది. ఇదిలా ఉండగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా జిల్లాకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు శిద్దా కృషిచేయాల్సిన అవసరం ఉంది. ఈపాటికే ట్రిపుల్ ఐటి జిల్లాకు వచ్చింది. టెక్నాలజీ పరంగా జిల్లాను మంత్రి అభివృద్ధి చేయాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు తీవ్ర అన్యాయమే జరిగింది. మంత్రివర్గ విస్తరణలో జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజుకు స్థానం దక్కుతుందని భావించారు. కాని మంత్రివర్గవిస్తరణలో ఏ ఒక్కరికి చోటుదక్కకపోగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన మంత్రిపదవుల స్థానంలో అప్రాధాన్యత పదవులను శిద్దాకు కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిద్దాకు ఉన్న రెండుశాఖలు పోయి కొత్తగా మూడు శాఖలు వచ్చినట్లైంది. మొత్తంమీద ఏపరంగా చూసిన జిల్లాకు తీవ్ర అన్యాయమే జరుగుతుందన్న విమర్శలు అన్నివర్గాలనుండి వినిపిస్తున్నాయి.