ప్రకాశం

‘లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 4: జిల్లాలో స్కానింగ్ కేంద్రాల్లో శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నేరమని అందుకు విరుద్ధంగా చేసినట్లైతే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని వై యాస్మిన్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక తన చాంబర్‌లో పిసిఅండ్ పిఎన్‌డిటి చట్టం జిల్లా స్థాయి సలహాకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి యాస్మిన్ మాట్లాడుతూ జిల్లాలో 11 ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రాలకు స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాయని కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాల్లో గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు లేనందున ప్రభుత్వానికి అనుమతి కోసం తెలియచేస్తామన్నారు. జిల్లాలో 27 స్కానింగ్ కేంద్రాలు లైసెన్స్ రెన్యూవల్స్ కోసం దరఖాస్తులు వచ్చాయని వీటిని పరిశీలించి మూడునెలల్లో అనుమతి మంజూరు చేస్తామని జిల్లాలో మొత్తం 181స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిలో సక్రమంగా పనిచేయని 31 స్కానింగ్ కేంద్రాలను రద్దుచేసామన్నారు. గత మూడునెలల్లో ఐదు కొత్త స్కానింగ్ కేంద్రాలు మంజూరు చేశామన్నారు. 27స్కానింగ్‌కేంద్రాలు లైసెన్స్‌లు రెన్యూవల్ చేసినట్లు చెప్పారు. స్కానింగ్‌కేంద్రాల పరీక్షల అనంతరం ఫారం ఎఫ్‌లను తప్పకుండా పంపాలన్నారు. అలాగే స్కానింగ్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలను వైద్య ఆరోగ్యశాఖాధికారులు, ఎన్‌జివోలు తరచూ తనిఖీలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ ఉషా, రిమ్స్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.