ప్రకాశం

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, ఏప్రిల్ 4: ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని కాదని పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ పార్టీకి కూడా మంచిది కాదని కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి అన్నారు. బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన పురంద్రీశ్వరి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన తండ్రి నందమూరి తారక రామారావు హయాంలో టిడిపిలో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు జరిగేవి కావని, అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి వస్తామంటే ముందుగా రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని సూచించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్టీ మారి వచ్చిన వారికి ఇలా మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే అంశాల పట్ల మన వైఖరి ఏమిటని ప్రధానమంత్రి మోదీకి, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. గోవా, మణిపూర్‌లలో బిజెపి ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడంపై ఆమె స్పందిస్తూ ఆయా రాష్ట్రాల్లో పార్టీ నుంచి బయటకు వెళ్లి ఎన్నికల్లో గెలిచిన వారే తిరిగి తమకు మద్దతు ఇచ్చారని, అక్కడి వ్యవహారాలకు, ఎపి వ్యవహారాలకు ఏ మాత్రం పారూప్యత లేదని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పివి కృష్ణారావు, కందుకూరి సత్యనారాయణ, పోశం వెంకటకృష్ణారావు, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.