ప్రకాశం

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 14:్భరత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరాడంబరత కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన ఆశయాల సాధనకు కట్టుపడి పనిచేద్దామని రాష్ట్ర అటవీ శాఖమంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నగరంలోని హెచ్‌సిఎం కాలేజి ప్రాంగణం సమీపంలో,ప్రకాశం భవనం ఎదురుగా, అంబేద్కర్ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహాలకు, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు మంత్రి శిద్దా, ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అంబేద్కర్ భారతరాజ్యాంగాన్ని రూపొందించిన మహామేధావి అని ప్రశంసించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరు ప్రగతిపథంలో ముందుకు వెళ్లాలన్నారు. భారతదేశంలో దళత ప్రజల అభివృద్ధి కోసం కృషిచేసిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయటాన్ని యావత్ భారతదేశం హర్షిస్తోందన్నారు. ఆ విగ్రహం నమునా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రదర్శించారని ఎంతో అద్భుతంగా ఉందని ఆయన వివరించారు. అనంతరం గుంటూరురోడ్డులోని ఎవన్ కన్వన్షన్ హాలులో అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరు ముందుకు వెళ్లాలన్నారు. పేదప్రజల సమస్యలపట్ల ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. ప్రభుత్వం దళితులను అన్నివిధాలా ఆదుకునేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. సంతనూతలపాడుశాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో దళిత ప్రజలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు పోరాడిన మహానీయుడన్నారు. భారతదేశ జాతి ఉన్నంతవరకు అంబేద్కర్ చిరస్మరణీయుడన్నారు. ముందుగా మంత్రి శిద్దా, శాసనసభ్యులు, ఇన్‌చార్జి కలెక్టర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో1508మంది స్వయం సహాయక సంఘాలకు 50కోట్ల 25 లక్షల రూపాయల బ్యాంకు లింగేజి రుణాల చెక్కును మంత్రి శిద్దా లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూఅధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు కొమ్మూరి రవిచంద్ర, ఉసురుపాటి బ్రహ్మాయ్య, నీలం నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.