ప్రకాశం

పనితీరు మార్చుకోండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 15:జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ సమావేశమందిరంలో సంసద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద ఎంపిక చేసిన దద్దవాడ, గణపవరం, పిసిపల్లి గ్రామాల్లో వౌలిక వసతులు, తాగునీరు, రహదారుల పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. దద్దవాడ ఆదర్శగ్రామప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఒక్క ట్యాప్‌కనెక్షన్ కూడా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఇంతవరకు ఇవ్వలేదని ఎంపి అసహనం వ్యక్తంచేశారు. తాగునీటి రక్షిత పథకం నిర్మాణానికి టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకురాలేదని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు ఎంపికి వివరించారు. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అవసరమైతే ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టాలన్నారు. పశ్చిమప్రాంతం ప్రజలు తీవ్రంగాతాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవసరమైన ప్రాంతా ల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్ల యజమానులకు బిల్లులు వెంటనే చెల్లించేందుకు ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గణపవరం ఆదర్శగ్రామానికి రక్షితతాగునీరు అందలేదన్నారు. తాగునీటి పథకం నిర్మించేందుకు ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు 40.5లక్షల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఆరునెలల క్రితం పంపినట్లు చెప్పారు. పిసిపల్లి గ్రామానికి ఆరురోజులకొకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారని సర్పంచ్ సుమ తన దృష్టికి తెచ్చారన్నారు. ఈవిషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు పైపులైన్ మరమ్మతులకు బాధ్యుడైన కాంట్రాక్టును రద్దుచేసి డిపార్ట్‌మెంటు పనులు చేపట్టాలన్నారు. దద్దవాడ, గణపవరం, పిసి పల్లి గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి రహదారులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దద్దవాడలో 40లక్షలరూపాయల మెటల్‌రోడ్డు పనులు పూర్తిచేశామన్నారు. కేంద్రప్రభుత్వం చొరవతో కనిగిరిలో ఐదు కిడ్ని డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుచేశారన్నారు. దద్దవాడలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటం, గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులను కోరారు. దద్దవాడలో పశువులకు వసతి గృహాం ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలను యుద్ధ ప్రాతిపదికపై అభివృద్ధిపనులు చేపట్టాలని ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, జిల్లాపరిషత్ సిఇఒ టి బాపిరెడ్డి, సిపిఒ భరత్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యాస్మిన్, వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.