ప్రకాశం

పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకే ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 14: రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకే ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద పేదలందరికీ గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం ఒంగోలు మండలంలోని కరవది గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన గృహాలకు మంత్రి శిద్దా, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, జిల్లాకలెక్టర్ సుజాతశర్మలు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కరవది జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికంపై గెలుపు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలందరికీ ఆరులక్షల గృహాలను ఈ సంవత్సరం నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారన్నారు. జిల్లాలోని 12నియోజకవర్గాలకు 760కోట్లరూపాయల వ్యయంతో 46,960 గృహాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో 156కోట్ల రూపాయలతో నాలుగువేల 68 గృహాలు ఒకేసారి మంజూరు చేసినట్లు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రప్రభుత్వం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిదిశగా ముందుకు వెళ్తుతుందన్నారు. ఈసందర్భంగా జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదప్రజలకు ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద ఆరులక్షల గృహాలను నిర్మించేందుకు 5,800 కోట్ల రూపాయలను ఖర్చుచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదప్రజలకు పక్కా గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకాన్ని చేపట్టిందన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ పేదప్రజలను అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాలను చేపట్టిందన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. కరవదిగ్రామంలో ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద 38మందికి యూనిట్ విలువ రెండులక్షల 90వేల రూపాయలతో ప్రారంభించినట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఈ పథకం కింద గృహాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాకలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ఆయన జయంతిరోజున ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పేదరికంపై గెలుపు సాధించేందుకే ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 14,250 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కొక్క యూనిట్‌విలువ రెండులక్షల 90వేల రూపాయలకు గాను ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు లక్షా 75వేల రూపాయల సబ్సిడీ, ఇతరులకు 1.25లక్షల సబ్సిడీ, లక్షా పదివేల రూపాయలు బ్యాంకు రుణాలుగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో, పట్టణప్రాంతాల్లో ఈ పథకం కింద ఐదువేల 26గృహాలను మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. మునిసిపాలిటీల్లో 50శాతం, లేఅవుట్ కాలనీల్లో 50శాతం చొప్పున ఇతరప్రాంతాల్లో చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ గృహాల పథకం కింద యూనిట్ విలువ ఐదులక్షల 50వేల రూపాయలు ఉంటుందని, అందులో లక్షా 50వేల రూపాయలు కేంద్రప్రభుత్వం సబ్సిడీ ఉంటుందన్నారు. అనంతరం డిఆర్‌డిఎ, ఐకెపి ఆధ్వర్యంలో 40మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖద్వారా 7.5లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.