ప్రకాశం

షర్మిలకు అన్నివిధాల ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, ఏప్రిల్ 16 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన షేక్ షర్మిలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన పొదిలికి విచ్చేసి రాష్ట్ర కాపు నాయకులు, తెలుగుదేశం నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన షర్మిలను అక్కడికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. షర్మిల ఆశయ సాధనకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన షర్మిలా తల్లిదండ్రులకు, బంధువులకు భరోసా ఇచ్చారు. మంగళవారం షర్మిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో కలవాలని సూచించారు. తాను అక్కడే ఉండి షర్మిలకు ప్రభుత్వ పరంగా ఆదుకునేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రావణి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిపి వెలిశెట్టి విజయగౌరి, పొదిలి సర్పంచ్ జి దీప, స్థానిక న్యాయవాది వరికూటి నాగరాజు, కళాశాల డైరెక్టర్ నాగ ప్రసాద్, కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.
వికసించిన విద్యా కుసమం షర్మిల : కందుల
ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన షర్మిలా విద్యావనంలో వికసించిన విద్యాకుసమం లాంటిదని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి అభివర్ణించారు. ఆదివారం స్థానిక వీరిశెట్టి కాలేజీలో షర్మిల అభినందనసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న కందుల మాట్లాడుతూ రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన షర్మిల తన నియోజకవర్గానికి చెందిన విద్యార్థి కావడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయన్న అపోహలకు షర్మిల విజయం తెరదించినట్లు అయ్యిందన్నారు. పశ్చిమ ప్రాంతంలోని మారుమూల పొదిలి పట్టణంలో షర్మిల చదివిన స్టేట్ టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఇందుకు గట్టి కృషి చేసిన వీరిశెట్టి కాలేజీ యాజమాన్యాన్ని కందుల ప్రత్యేకంగా కొనియాడారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని షర్మిల వంటి విద్యార్థిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్టస్థ్రాయిలో 8వ ర్యాంకు సాధించిన వీరిశెట్టి కాలేజీ కు చెందిన భవ్యశ్రీను కూడా సన్మానించారు. అనంతరం కందుల నారాయణ రెడ్డి పదివేల రూపాయలు నగదును షర్మిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జిల్లా వైద్య శాఖాధికారి, రిమ్స్ సీనియర్ వైద్యులు సుబ్బారావు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని షర్మిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీప, శ్రావణి వెంకటేశ్వర్లు, వై వెంకటేశ్వరెడ్డి, కాటూరి వెంకట నారాయణబాబు, కాలేజీ డైరెక్టర్లు నాగప్రసాద్, కృష్ణంరాజు, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.