ప్రకాశం

రాష్ట్రంలో ప్రతిపక్షం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 16:రాష్ట్రంలో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షపాత్ర పోషించటంలో ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర సమాచార శాఖమంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఆదివారం ఉదయం తిరుపతికి వెళ్తూ మార్గమధ్యలో కొద్దిసేపు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బసచేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతిపక్షపార్టీగా రాష్ట్రంలో వైకాపా ఉండటం ప్రజల దురదృష్టమన్నారు. అడగడుగునా అభివృద్ధిని అడ్డుకోవటమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బోగాపురంలో విమానాశ్రయాన్ని, అమరావతిలో రాజధానిని అడ్డుకునేందుకు రైతులను జగన్ రెచ్చగొట్టారని విమర్శించారు. దివిస్ పరిశ్రమను రాకుండా, విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేశారన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షపార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుందన్న విషయాన్ని జగన్ మర్చిపోయారన్నారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై అపోహలు వచ్చేవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారున్నారు. దీనికి తోడు డిల్లీవెళ్లి రాష్ట్రప్రజల పరువుతీస్తున్నారని మండిపడ్డారు. విపక్షం కాస్తా విఫల పక్షంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు జగన్ విపరీతమైన ప్రకటనలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో పారిపోతుంటారని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు అసెంబ్లీని వేదికగా తీసుకోవాల్సిన ప్రతిపక్షం ప్రజాసమస్యలను చర్చించకుండా అడగడుగున అడ్డుపడుతున్నారన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్టమూర్తి, టిడిపి యువనేత కరణం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మంత్రికి జిల్లాసమస్యలను ప్రజాప్రతినిధులు వివరించారు. ప్రధానంగా ఒంగోలు నగరంలో పక్కాగృహాలను నిర్మించేందుకు జి ప్లస్-2తరహాలో ఏర్పాటుచేసేందుకు 21ఎకరాల భూమిని సేకరించి రాష్ట్రప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు, ఈవిషయాన్ని గమనించి త్వరగా ఆమోదం తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కొండెపినియోజకవర్గంలోని సింగరాయకొండలో ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని ఆసమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రెండేళ్లలో పది లక్షల పక్కా గృహాల నిర్మాణం
రాష్ట్రంలో రాబోయే రెండు సంవత్సరాల్లో పది లక్షల మంది నిరుపేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో గృహాలను నిర్మించకుండానే లక్షల గృహాలు నిర్మించినట్లు రికార్డుల్లో చూపిందని విమర్శించారు. 2016-17 సంవత్సరంలో రెండు లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2017-18, 2018-19 సంవత్సరాల్లో నాలుగు లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2014 సంవత్సరానికి ముందు నిర్మించిన రెండు లక్షల 93 వేల గృహాలు పునాదులు, లెంటిల్, తదితర వివిధ దశల్లో అసంపూర్తిగా ఆగిపోయిన ఒక్కొక్క గృహానికి 75 వేల రూపాయల గృహనిర్మాణ రుణంతోపాటు, మరో 25 వేల రూపాయలు అదనంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయల నిధులను గృహ నిర్మాణ శాఖకు మంజూరు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 40 వేల గృహాలు మంజూరైనట్లు తెలిపారు. 2017-19 సంవత్సరాలకు సంబంధించి వేలాది గృహాలు కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేయాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పక్కాగృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే తమ లక్ష్యమన్నారు.