ప్రకాశం

బిసి కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ 516 కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,ఏప్రిల్ 28: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం బిసి కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో 366కోట్లరూపాయలను కేటాయిస్తే జాతీయ బిసి కార్పొరేషన్ ద్వారా మరో 150కోట్లరూపాయలతో కలిపి 516కోట్లరూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే బిసిలకు రాష్ట్రంలో అగ్రతాంబులం ఇస్తున్నారన్నారు.బడుగు,బలహీనవర్గాలకు అండగా ఉంటూ వారి సంక్షేమంకోసం నిరంతరం కృషిచేస్తుందన్నారు. గత కాంగ్రెస్‌ప్రభుత్వ పదిసంవత్సరాల పరిపాలనలో బడ్జెట్‌లో మాత్రం నిధులను కేటాయించి ఇతర పథకాలకు మళ్లించి కేవలం 75కోట్లరూపాయలను మాత్రమే ఖర్చుచేశారన్నారు. తమప్రభుత్వ హయాంలో 2014-15సంవత్సరంలో బిసి కార్పొరేషన్‌కు 150కోట్లరూపాయలు కేటాయించి నిధులను ఖర్చుచేశామన్నారు. 2016-17సంవత్సరంలో 209కోట్లరూపాయలు కేటాయించగా ఆదనంగా లబ్ధిదారులు పెరగటం వలనమరో రెండువందల కోట్లరూపాయలను కేటాయించి ఖర్చుచేయటం జరిగిందన్నారు. 2017-18 సంవత్సరంలో 516కోట్లరూపాయలను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో బిసి కార్పొరేషన్ ద్వారా 2015-16సంవత్సరానికి సంబంధించి 12కోట్ల 42లక్షల రూపాయలను కేటాయించగా 2406మంది లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఎన్‌టిఆర్ విదేశీ విద్యకు బిసి విద్యార్థులను ఇతర దేశాలకు పంపించేందుకు వెయ్యిమంది విద్యార్థులను ప్రోత్సహించగా 410మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మని, ఉత్తర కొరియా, రష్యా, కజిగస్తాన్, చైనా తదితర దేశాలకు విద్యార్థులను ఇప్పటికే పంపించటం జరిగిందన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్షపార్టీలు విమర్శలే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పిడుగు పాటుకు 40 మేకలు మృతి
కొమరోలు, ఏప్రిల్ 28: మండలంలోని పాయలపల్లి గ్రామంలో గురువారం అర్థరాత్రి సంభవించిన పిడుగుపాటుకు 40 మేకలతోపాటు ఒక దూడ, కోళ్ళు మృతి చెందాయి. ఆగ్రామానికి చెందిన ఓవిళ్ళ చిన్నఓబులేసు రోజువలె తన మేకలను సాయంత్రం తన ఇంటి పక్కన ఉన్న దొడ్డిలో తోలాడు. గురువారం సాయంత్రం కూడా మేకలను దొడ్డిలో తోలాడు. అర్థరాత్రి నుంచి పెనుగాలులతో కూడిన వర్షం కురుస్తూ ఇంటి సమీపంలో పిడుగుపడింది. ఆ ప్రభావానికి 40 మేకలతోపాటు ఒక దూడ, కోళ్ళు మృతి చెందాయి. దీంతో తనకు దాదాపు 3లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చిన్నఓబులేసు వాపోయాడు. మూగ జీవాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు తీరని నష్టం వాటిల్లిందని ఓబులేసు కుటుంబ సభ్యులు వాపోయారు. కావున తమకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందచేసి ఆదుకోవాలని ఓబులేసు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న విఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, ఎంఆర్‌ఐ ఆ గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు.