ప్రకాశం

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలరూరల్, ఏప్రిల్ 14: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించడం సులువవుతుందని అగ్ని మాపక అధికారి కె సునీల్ కుమార్ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. ముందుగా సిబ్బంది అగ్నిమాపక పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శకటం వచ్చే సమయంలోగా ప్రాథమికంగా ప్రజలే స్వయంగా మంటలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబై లోని దాల్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో 336 మందితో పాటు 66 మంది సిబ్బంది కూడా మరణించారని, వారి మృతికి చిహ్నంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు భారతదేశం అంతటా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఒంగోలు తరువాత రెండో పట్టణంగా చీరాల ఉందన్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లో అనేక ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్‌లు, విద్యా సంస్థలు ఉన్నాయని కానీ ఇంతటి ప్రాముఖ్యత గల చీరాలకు కేవలం ఒక అగ్నిమాపక శకటం మాత్రమే ఉండడం వల్ల ఆపద సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ ఎంత అవసరమో అగ్ని ప్రమాదాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది కూడా అంతే అవసరమన్నారు. ఈ సందర్భంగా అగ్ని మాపక శాఖ పంపిన కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగామన కల్పించేందుకు అగ్నిమాపక శకటంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి, ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు మంటలను ఏ విధంగా అదుపు చేయాలనే విషయం వారం రోజుల పాటు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అంబేద్కర్‌కు బలరాం ఘన నివాళి
అద్దంకి, ఏప్రిల్ 14: అణగారిన వర్గాలకు, బడుగు, బలహీన వర్గాలకు చేయూతనిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచదేశాల మన్ననలు పొందిందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారంనాడు స్థానిక బంగ్లారోడ్డు వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం భారతీయులకే గర్వకారణమన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈకార్యక్రమంలో యు.దేవపాలన, గంగాధర్, బాబూరావు, జ్యోతి చంద్రవౌళి, అర్జున్‌రావు, నాగరాజు, శ్రీనివాసరావు, వెంకటనరసింహారావు పాల్గొన్నారు.

అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన బివి రాఘవులు
ఒంగోలు, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం ఒంగోలు నగరంలోని హెచ్‌సిఎం కాలేజి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేద్కర్‌కు మంద కృష్ణమాదిగ నివాళి
అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ గురువారం స్థానిక హెచ్‌సిఎం కాలేజి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.